Home /News /politics /

EXIT POLL RESULTS 2021 LIVE UPDATES DMK SWEEPS IN TAMIL NADU NDA LEADS IN PUDUCHERRY SU

Tamil Nadu Exit Poll Result: డీఎంకే‌ క్లీన్ స్వీప్.. ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో ఒకే ఫలితం.. పుదుచ్చేరిలో ఎవరివైపు మొగ్గు ఉందంటే..

స్టాలిన్ (File Image)

స్టాలిన్ (File Image)

తమిళనాట ఓటర్ నాడిపై ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకే రకమైన అంచనాను వెల్లడించాయి. డీఎంకే క్లీన్ స్వీప్ చేస్తోందని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన అన్నీ సంస్థలు అభిప్రాయపడ్డాయి.

    తమిళనాట ఓటర్ నాడిపై ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకే రకమైన అంచనాను వెల్లడించాయి. రాష్ట్రంలో డీఎంకే కూటమి క్లీన్ స్విప్ చేస్తుందని P-MARQ, REPUBLIC CNX, టూడేస్ చాణక్య, యాక్సిస్-మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే కూటమి మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి 50 వరకు స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకాంర కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని తెలుస్తోంది. అయితే అన్నాడీఎంకే నుంచి బలమైన నాయకత్వం లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను డీఎంకే సమర్థవంతంగా ఒడిసి పట్టుకోవడం.. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావం చేసినట్టుగా తెలుస్తోంది.

    తమిళనాట దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధి లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో.. ప్రజలు డీఎంకేకు పట్టం గట్టారని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ పోల్స్‌ చూసిన డీఎంకే శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు.  ఎగ్జిట్ పోల్స్ నిజమైతే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.  అయితే వాస్తవ ఫలితాలు ఏమిటనేది మే 2న ఓట్ల లెక్కింపు అనంతరం తేలనుంది.

    తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. 71.43 శాతం పోలింగ్ నమోదయింది. గెలుపుపై డీఎంకే కూటమి, అన్నాడీఎంకేక కూటమి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు.73.58శాతం పోలింగ్ నమోదయింది. కేరళలో 2.74 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. అక్కడ రికార్డు స్థాయిలో 81.64 శాతం పోలింగ్ నమోదయింది.

































    తమిళనాడు(234)  డీఎంకే + అన్నాడీఎంకే+ఇతరులు
    యాక్సిక్- మై ఇండియా175-19538-541-4
    రిపబ్లిక్ సీఎన్‌క్స్160-17058-684-6
    P-MARQ165-19040-652-9
    టూడేస్-చాణక్య164-18646-680-6

    పుదుచ్చేరిలో ఎన్డీయే..
    30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రిపబ్లిక్ సీఎన్‌ఎక్స్ ఎన్డీఏ 16-20 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 11-13 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక, ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్.. ఎన్డీఏ 19-23, యూపీఏ 6-10, ఇతరులు 1-2 స్థానాలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Exit polls 2021, Puducherry Assembly Elections 2021, Tamil Nadu Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు