యాత్రలోని ఆ సీన్‌తో సంబంధం లేదన్న వైసీపీ మాజీ నేత

యాత్ర

యాత్ర సినిమాలో తన భార్య చరిత పేరు ఉన్న సన్నివేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె భర్త, మాజీ వైసీపీ నేత గౌరు వెంకట్ రెడ్డి అన్నారు.

  • Share this:
    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమాలోని అనేక పాత్రలు ఆయన రియల్ లైఫ్‌లో నుంచే తీసుకున్నారనే టాక్ ఉంది. సినిమాలోని ఆ పాత్రలకు కూడా అవే పేర్లను పెట్టి రియలిస్టక్‌గా ఉండేలా చేయడంలో దర్శకుడు మహి.వి.రాఘవ సక్సెస్ సాధించారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యే గౌరు వెంకట్ రెడ్డి, ఆయన భార్య సతీమణి చరిత ప్రస్తావన కూడా సినిమాలో తీసుకొచ్చారు. తనను నమ్ముకున్న వారి కోసం వైఎస్ఆర్ ఏదైనా చేస్తారనే విషయాన్ని వారి పాత్ర ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు.

    అయితే సినిమా మొదట్లోనే వచ్చే సీన్‌తో తమకు ఏ మాత్రం సంబంధం లేదని మాజీ వైసీపీ నేత, ప్రస్తుత టీడీపీ నాయకుడు గౌరు వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమాలో వచ్చే పేరు తన భార్య చరితదే అయినా... ఈ సన్నివేశంతో తమకు సంబంధం లేదని వివరించారు. ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించే క్రమంలో దర్శకుడు, చిత్ర యూనిట్ అలాంటి సీన్‌లో తన భార్య చరిత పేరును ఉపయోగించుకుని ఉండొచ్చని గౌరు వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమకు సీఎం వైఎస్ జగన్‌తో ఎలాంటి విభేదాలు లేవని... వైసీపీ టికెట్ నిరాకరించడంతో నియోజకవర్గంలో పోటీ చేయడం కోసమే ఆ పార్టీని వీడినట్టు గౌరు వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
    First published: