కాంగ్రెస్ నేత సర్వే డ్రామా... చూసి తీరాల్సిందే...

కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణకు చెందిన నిరసన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

news18-telugu
Updated: October 22, 2019, 1:20 PM IST
కాంగ్రెస్ నేత సర్వే డ్రామా... చూసి తీరాల్సిందే...
సర్వే సత్యనారాయణ అరెస్ట్ దృశ్యాలు
  • Share this:
నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం సహజం. అలా అరెస్ట్ చేసే క్రమంలో నేతలు ఎంతో కొంత ప్రతిఘటిస్తుంటారు. కానీ... అసలు ఎలాంటి నిరసనలు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేసినట్టు యాక్టింగ్ చేయడాన్ని ఎక్కడా చూసి ఉండరు. కానీ ఓ నాయకుడు ఇలాగే చేశారు. ఆయన మరెవరో కాదు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకరైన సర్వే సత్యనారాయణ. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీరుకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కొందరిని ముందుగానే గృహ నిర్భందం చేసిన పోలీసులు... మరికొందరిని ప్రగతి భవన్ పరిసరాల్లో అరెస్ట్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వే సత్యనారాయణను పోలీసులు ఆయన ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేకపోయినా... ఇదంతా జస్ట్ యాక్టింగ్ అని తేలడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా సర్వేను ముట్టడించిన పోలీసులు... ఏదో షూటింగ్‌లో షాట్ ఓకే అని చెప్పగానే ఆయనను వదిలేశారు. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణకు చెందిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సర్వేపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading