‘జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే’...టీడీపీ మాజీ ఎంపీ ఆసక్తికరవ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు... చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి సినీనటులపై కూడా జేసీ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు దీనిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: June 16, 2019, 9:56 AM IST
‘జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే’...టీడీపీ మాజీ ఎంపీ ఆసక్తికరవ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో
news18-telugu
Updated: June 16, 2019, 9:56 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగియగానే.. నాయకులు ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... మరోసారి ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసులో ఉన్న మాటను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడంలో జేసీ ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ఆయన ఈసారి ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి ? అనే దానిపై స్పందించారు. టీడీపీకి ఇక ముందు కూడా చంద్రబాబే దిక్కు అవుతారన్నారు జేసీ. ఆయన తప్ప మరో ఆ పార్టీకి మరో నాయకత్వం లేదని స్పష్టం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే బావుంటుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా జేసీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొన్నాళ్లకు నాయకుడు అవ్వొచ్చేమోనని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆయన గురించి ఇప్పుడేమి చెప్పలేమన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంతటివాడికి కూడా రాజకీయాలు సరిపడవని చెప్పానన్నారు జేసీ. పవన్ కు ఎంత పేరుంది? కానీ ఆయనను చూడటానికి మాత్రమే జనం వస్తారే తప్ప వారంతా ఆయన వెంట నడవరన్నారు. చిరంజీవి, రోజా ఇలా ఎంతోమంది సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చరన్న జేసీ.... తెరపై నటించే ఆ నటులను చూడ్డానికి జనం వస్తారే తప్ప వాళ్లను రాజకీయంగా ఆమోదించడం చాలా కష్టం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీతో పాటు... ఎన్టీఆర్.. పవన్ కల్యాణ్ వంటి సినీనటులపై కూడా జేసీ  కామెంట్లు చేయడంతో ఇప్పుడు దీనిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. జూ.ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే బావుంటందని భావించినవాళ్లంతా... ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆలోచనలో పడ్డారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే...అట్రాక్షన్ ఉంటుంది కానీ.. పెద్దగా రాజకీయాల్లో మాత్రం రాణించలేరా అంటూ... చర్చించుకుంటున్నారు.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...