అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా? ఆయనతో పాటు కుమారుడు పవన్ కుమార్ రెడ్డి కమలం గూటిలో వాలబోతున్నారా? ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు కూడా జరిపారా? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెప్పేలా.. తాజాగా ఈ మాజీ టీడీపీ ఎంపీ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. తన కుమారుడు పవన్‌తో కలిసి ఢిల్లీలో బీజేపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. జేసీ బీజేపీలోకి వెళ్తున్నారని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కమలం పార్టీ ఏపీపై ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత వేగవంతం చేసింది. జేసీ తర్వాత మరింతమంది నేతలు కమలం గూటికి చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనంతపురం నుండి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదా పురం సూరి బీజేపీలో చేరారు. గత కొద్ది రోజులుగా అనంతపురం టీడీపీ నేతలతో బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత పయ్యావుల కేశవ్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.అదే విధంగా అనంతపురం టీడీపీలో మరో ప్రధాన కుటుంబం పరిటాల ఫ్యామిలీని సైతం ఆకర్షించే పనిలో పడ్డారు. దీనిపై పరిటాల వర్గం సైతం తర్జన భర్జన పడుతోంది. పరిటాల కుటుంబంతో బీజేపీ నేతలు సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.