అంతా లోకేశ్ వల్లే... సీబీఐ విచారణ కోరతానన్న బీజేపీ నేత

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును లోకేశ్ నిలువునా ముంచేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ధ్వజమెత్తారు. లోకేశ్ కారణంగా త్వరలోనే టీడీపీ కాళీ కాబోతుందని అన్నం సతీష్ జోస్యం చెప్పారు.

news18-telugu
Updated: July 19, 2019, 4:19 PM IST
అంతా లోకేశ్ వల్లే... సీబీఐ విచారణ కోరతానన్న బీజేపీ నేత
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
  • Share this:
కేవలం నారా లోకేశ్ కారణం ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు అన్నం సతీష్ ఆరోపించారు. బీజేపీలో చేరిన తరువాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన అన్నం సతీష్... టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటి శాఖలో జరిగిన అవినీతిపై రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రిని కలుస్తానని తెలిపారు. దీనిపై కేంద్రంతో మాట్లాడి సిబిఐ విచారణ కోరతానని వెల్లడించారు. పార్టీలో ఎంతోమంది నాయకులు లోకేశ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నం సతీష్ ఆరోపించారు. లోకేష్ నాయకత్వంలో పని చేయడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేశానని వివరించారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును లోకేశ్ నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు కూడా లోకేశ్ ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టారని అన్నారు. లోకేశ్ కారణంగా త్వరలోనే టీడీపీ కాళీ కాబోతుందని అన్నం సతీష్ జోస్యం చెప్పారు. తనకు ఎమ్మెల్సీగా మరికొంతకాలం పదవీకాలం ఉన్నప్పటికీ బీజేపీలో చేరానని వివరించారు. కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్‌గా పలు కీలక పదవులలో పని చేసి కార్యకర్తగా టీడీపీలో ఎదిగానని... తండ్రిని అడ్డుపెట్టుకుని మంత్రిని కాలేదని అన్నం సతీష్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిజెపినే అని అన్నారు. 2022లో జిమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్నం సతీష్ తెలిపారు.

First published: July 19, 2019, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading