జగన్‌కు జలీల్ ఖాన్ సవాల్... ఏమన్నారంటే..

జగన్ అంటే ఉద్యోగులు భయపడుతున్నారు... అందుకే ఉద్యోగులు సైలెంట్ అయిపోయారన్నారు.

news18-telugu
Updated: January 4, 2020, 3:23 PM IST
జగన్‌కు జలీల్ ఖాన్ సవాల్... ఏమన్నారంటే..
జలీల్ ఖాన్
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కళ్ళు ఉన్నవాడు, కడుపుకి అన్నం తింటున్న వాడు రాజధాని మారుస్తా అని అనడన్నారు. జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరిపాలన అంతా ఒక దగ్గర నుండే జరగాలన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటీ.. అని ప్రశ్నించారు. జగన్ పతనానికి తానే నాంది పలికాడన్నారు. అమరావతిలో పోరాడుతున్న రైతు సోదరులు, మహిళలకు 13 జిల్లాల రైతులు,మహిళలు మద్దతు పలకాలని జలీల్ ఖాన్ పిలుపునిచ్చారు. విశాఖ లో ప్రభుత్వ భూములు, క్రిస్టియన్ సంస్థల భూముల మీద జగన్ కన్ను పడింది..

ఒక్క చాన్స్ ఇవ్వండి ఏపీని ఇంద్ర లోకం చేస్తానని జగన్ అన్నడాని గుర్తు చేశారు. హై పవర్ కమిటీ అంటే మేధావులు.. రిటైర్ జడ్జిలు ఉంటారన్నారు. గొర్రెల మందలా మీ మనుషులే ఉన్నారంటూ జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. మీ పరిపాలన మీద ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని జగన్‌కు సూచించారు. ఈ సందర్భంగా సీఎంకు సవాల్ చేశారు జలీల్ ఖాన్. మీ ఎమ్మెల్యేని రాజీనామా చేయించి... తన  మీద పోటీ చేయించి గెలిపించి... ప్రజలు ఆయన వైపు ఉన్నారని నిరూపించుకోవాలన్నారు. బోస్టన్ కమిటీ కి రాజధాని పై అసలు అవగాహనా ఉందా?? అని ప్రశ్నించారు. మహిళలను , రైతులను ఇబ్బంది పెడితే దేవుడు చూస్తూ ఉరుకోడన్నారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్ కి పాదాభివందనం చేస్తా...నెత్తిన నీరు చల్లు కుంటానన్నారు. జగన్ అంటే ఉద్యోగులు భయపడుతున్నారు... అందుకే ఉద్యోగులు సైలెంట్ అయిపోయారన్నారు.

First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు