ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల

స్పీకర్ కోడెల శివప్రసాదరావు

ఎంబీబీఎస్ చదివిన కోడెల 1983 లో వైద్య వృత్తిని వదిలి ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు.

 • Share this:
  దాదాపు 36 ఏళ్ల రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదవ తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు.

  చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివాడు. పల్నాడులో కొత్త అధ్యాయం లిఖించడానికి నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు.  కోడెల భార్య శశికళ ముగ్గురు పిల్లలు విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ ఉన్నారు. ముగ్గురు సంతానం కూడా డాక్టర్ వృత్తిలోనే ఉన్నారు.

  1983లో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేశారు. తొలిసారిగా నరసరావు పేట ఎన్నికల్లో పోటీ చేసి కోడెల గెలిచారు.  ఎంబీబీఎస్ చదివిన కోడెల 1983 లో వైద్య వృత్తిని వదిలి ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచి ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత రెండుసార్లు ఆయన ఓటమి చవిచూశారు.  రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున కోడెల గెలిచారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్రకు తొలి శాసనసభాపతిగా కోడెల పనిచేశారు.

   
  Published by:Sulthana Begum Shaik
  First published: