ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు... సీఎం జగన్ ఆదేశం

కోడెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇంట్లో టిఫిన్ చేసి... 10.10కి బెడ్‌రూంకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు.

news18-telugu
Updated: September 17, 2019, 12:08 PM IST
ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు... సీఎం జగన్ ఆదేశం
కోడెల శివప్రసాద రావు (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసారావు మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్ ఎల్బీ సుబ్రహ్మణ్యానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మాజీ స్పీకర్ కోడెల తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. కాసేపట్లో కోడెల భౌతికకాయం గుంటూరు టీడీపీ కార్యాలయానికి చేరుకోనుంది.

కోడెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇంట్లో టిఫిన్ చేసి... 10.10కి బెడ్‌రూంకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఆ సమయంలో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు సహా ఏడుగురు ఉన్నారు. 10.40కి ఆయన్ని బసవతారకం కాన్సర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పల్స్ పడిపోయినా (దాదాపు మరణమే)... డాక్టర్లు మరో 40 నిమిషాలపాటూ... బతికించేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రాథమికంగా తేల్చినది ఇదే. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇవాళ పోలీసులకు అందుతుంది. అందులో అది సూసైడా కాదా అన్నది తేలే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం కోడెల మరణంపై రాజకీయాలు చేయొద్దనీ, తమను మరింత కుంగదీయొద్దనీ వేడుకుంటూ కన్నీటి సంద్రమయ్యారు.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading