ఉస్మానియా ఆస్పత్రిలో కోడెల మృతదేహానికి పోస్టుమార్టమ్

మాజీ స్పీకర్ కోడెల మృతి

కోడెల కుటుంబ సభ్యులు, అల్లుడితో మాట్లాడి భౌతికకాయాన్ని గుంటూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

  • Share this:
    ఆత్మహత్యకు పాల్పడిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితిని చంద్రబాబు సమీక్షిస్తున్నారని సోమిరెడ్డి మీడియాతో అన్నారు. కోడెల కుటుంబ సభ్యులు, అల్లుడితో మాట్లాడి భౌతికకాయాన్ని గుంటూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం కోడెల భౌతికకాయాన్ని ఉంచుతామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: