దమ్ముంటే...కేసీఆర్ ఆస్తులపై ఐటీ దాడులు చేయాలి...వీహెచ్ సీరియస్

ప్రస్తుతం మోదీకి జగన్, కేసీఆర్ మద్దతుగా నిలుస్తున్నారని, అందుకే వారిపట్ల ఈసీ మెతక వైఖరి వహిస్తోందని వీహెచ్ అన్నారు. ఐటీ దాడుల పేరిట ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయడం తగదని హితవు పలికారు.

news18-telugu
Updated: April 6, 2019, 2:24 PM IST
దమ్ముంటే...కేసీఆర్ ఆస్తులపై ఐటీ దాడులు చేయాలి...వీహెచ్ సీరియస్
వి హనుమంతరావు(ఫైల్ ఫోటో..)
  • Share this:
ఎన్నికల వేళ ఏపీలో చీఫ్ సెక్రటరీ మార్పుపై తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు కేవలం కొద్ది రోజులకు ముందు సీఎస్‌ అనిల్ చంద్ర పునేఠాను ఎలా మారుస్తారని వీహెచ్ విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎలక్షన్ కమిషన్‌ను చూడలేదని అన్నారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఎలక్షన్ కమిషన్ మోడీ కనుసన్నల్లో పనిచేస్తోందని విమర్శించారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష హోదాలో ఎన్నికల కమిషన్ కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వాటన్నింటినీ బుట్టదాఖలు చేసారని విమర్శించారు. ప్రస్తుతం మోదీకి జగన్, కేసీఆర్ మద్దతుగా నిలుస్తున్నారని, అందుకే వారిపట్ల ఈసీ మెతక వైఖరి వహిస్తోందని అన్నారు. ఐటీ దాడుల పేరిట ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయడం తగదని హితవు పలికారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ దాడులు చేయాలని ఈ సందర్భంగా వీహెచ్ సవాల్ విసిరారు.

First published: April 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు