మన్మోహన్ సింగ్ హెల్త్ అప్‌డేట్.. మాజీ ప్రధానికి కరోనా టెస్టులు..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(87) ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఆస్పత్రి తాజా బులిటెన్ విడుదల చేసింది.

news18-telugu
Updated: May 12, 2020, 11:32 AM IST
మన్మోహన్ సింగ్ హెల్త్ అప్‌డేట్.. మాజీ ప్రధానికి కరోనా టెస్టులు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
  • Share this:
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(87) ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఆస్పత్రి తాజా బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకొని సాధారణ స్థితికి వస్తున్నారని తెలిపింది. అంతేకాదు.. కరోనా టెస్టు కూడా చేశామని, నెగటివ్‌గా ఫలితం వచ్చిందని వెల్లడించింది. ముందుగా ఆయన్ను కార్డియో విభాగంలో ఉంచామని, ఇప్పుడు ప్రైవేట్ రూమ్‌కు తరలించామని, డాక్టర్ల బృందం ఆయనకు ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నారని వివరించింది. ఆదివారం నాడు ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో సన్నిహితులు ఆయన్ను రాత్రి 8.45 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పిన డాక్టర్లు.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఈ రోజు వెల్లడించారు.

కాగా, మన్మోహన్ సింగ్ హార్ట్ పేషంట్, మధుమేహం కూడా ఉంది. 2009లో ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్‌ గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన మందులు వాడుతూ వస్తున్నారు. ఇదిలా ఉండగా, మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగులో ట్వీట్ చేశారు. ‘భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్) నిర్దేశకుడితో మాట్లాడి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిసి సంతోషిస్తున్నాను. మన్మోహన్‌ సింగ్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుతున్నాను.’ అని పేర్కొన్నారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: May 12, 2020, 11:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading