EX PRIME MINISTER DEVEGOWDA SHOCKING COMMENTS ON PM MODI PS
దానికి మోదీనే అడ్డుపడ్డారు.. ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవన్న దేవేగౌడ
దేవేగౌడ, మోదీ
దేశంలో ఇప్పుడున్న సీనియర్ రాజకీయనేతల్లో ఒకరిగా మాజీ ప్రధాని దేవేగౌడకు ప్రత్యేక స్థానం ఉంది. వృద్ధాప్యం ముంచుకొస్తున్నా ఆయన ప్రజాసేవలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మోదీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
2014 సాధారణ ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. అప్పటివరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపై ఆశీనులయ్యారు. అయితే, అంతకు ముందు జరిగిన ఎన్నికల ప్రచారం.. కురుక్షేత్ర సమరాన్నే తలపిచింది. అప్పటి అధికార కాంగ్రెస్కు, బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలాయి. నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. 275కు పైగా స్థానాల్లో బీజేపీ ఎంపీలు విజయం సాధిస్తారని, బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అయితే, మోదీ ప్రకటనపై మాజీ ప్రధాని దేవేగౌడ ఓ సవాల్ విసిరారు. ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ 276కు మించి సీట్లు సాధిస్తే.. తాను పోటీ చేస్తున్న హాసన్ స్థానం నుంచి గెలిచినప్పటికీ రాజీనామా చేసేస్తానని ప్రకటించారు. అయితే, అనూహ్యంగా బీజేపీ 282 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. ఫుల్ మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో, దేవేగౌడ ప్రధాని మోదీని కలిసి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారట. అయితే, మోదీ మాత్రం ఆయనను వద్దని వారించారట.
‘‘ నేను 2014 లోక్సభ ఎన్నికల సమయంలో మోదీకి ఒక సవాల్ విసిరాను. మీరు చెబుతున్నట్టు బీజేపీ గనుక 275కు పైగా ఎంపీ స్థానాలు గెలిస్తే, నేను రాజీనామా చేస్తానని ప్రకటించాను. అయితే బీజేపీ 282 స్థానాలు గెలవడంతో మోదీ దగ్గరకు వెళ్లి.. రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డాను. అయితే, అప్పుడు మోదీ ‘‘మీరు దాన్ని సీరియస్గా తీసుకోకండి. మీరు రాజకీయాల్లో చాలా సీనియర్, మీలాంటి వాళ్లు రాజీనామా చేయకూడదు’’ అని అన్నారు. నాకు ఎవరితోనూ వ్యక్తిగతమైన విభేదాలు లేవు. ఈ 5ఏళ్లలో మోదీని నాలుగైదు సార్లు కలిశాను’’ అని పాత విషయాలను గుర్తు చేసుకున్నారు దేవేగౌడ.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.