AP Municipal Elections: అదే జరిగితే వైసీపీకి కష్టమేనా... టీడీపీకి ప్లస్ పాయింట్ కానుందా...?

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మున్సిపల్ ఎన్నికలు (AP Municipal Elections) ముగిశాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా గెలుపోటములపైనే చర్చలు జరుగుతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా గెలుపోటములపైనే చర్చలు జరుగుతున్నాయి. ఆధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన-బీజేపీ కూడా విజయంపై ధీమాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ వందశాతం విజయాలు తమవేనని చెప్తోంది. ఐతే ఏపీ రాజదాని ప్రాంతమైన విజయవాడలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ వైసీపీ-టీడీపీ ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఐతే విజయవాడలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నా.. ఒక్క విషయంలో మాత్రం టీడీపీకి కలిసొచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్పుడదే వైసీపీని టెన్షన్ పెడుతోంది. ఫలితాలం ఏకపక్షంగా వస్తే ఫర్వాలేదుగానీ.. రెండు పార్టీలకు సమానంగా సీట్లు వస్తే జాతకాలు తారుమారయ్యే పరిస్థితులు రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

    విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లలోనూ వైసీపీ పోటీ చేయగా.. టీడీపీ 56 స్థానాల్లో పోటీ చేసింది. ఏడు డివిజన్లు సీపీఐకి కేటాయించగా.. ఒక డివిజన్లో జనసేనకు మద్దతిచ్చింది. టీడీపీ ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ప్రకటించగా.. వైసీపీ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చిన తర్వాతే వైసీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. విజయవాడలో 40 నుంచి 50 సీట్లు గెలుస్తామని వైసీపీ ధీమాగా ఉండగా.. టీడీపీ మాత్రం 35 నుంచి 40 స్థానాల్లో విజయం తమదేనని టీడీపీ చెప్తోంది. ఫలితాల సంగతి ఎలా ఉన్నా పోరు మాత్రం హోరాహోరీగా ఉండనుందని తెలుస్తోంది. రెండు పార్టీలకు దాదాపు సమానంగా సీట్లు వచ్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి.

    టీడీపీకే ఛాన్స్..
    విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫిషియో ఓట్ల విషయానికి వస్తే.. టీడీపీకే ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేషన్లో 64 డివిజన్లు ఉండగా.. ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు నగరంలోనే ఉన్నారు. వీరు కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు విజయవాడకు చెందినవారున్నారు. మరో ఎమ్మెల్సీకి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చే అవకాశముండటంతో మొత్తం ఓట్ల సంఖ్య 71కి చేరింది. దీంతో 36 ఓట్లు వచ్చిన పార్టీకి మేయర్ పీఠం దక్కుతుంది.

    ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, పరుచూరి అశోక్ బాబు టీడీపీ తరపున ఉన్నారు. అలాగే మరో ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా టీడీపీకి చెందిన వారే కావడంతో వారి ఓట్లన్నీ సొంతపార్టీకే పడతాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 36ను చేరుకోవాలంటే.. టీడీపీ 30 సీట్లలో గెలిస్తే సరిపోతుంది.

    వైసీపీకి మాత్రం కేవలం ఇద్దరు ఎక్స్ అఫిషియో ఓట్లర్లు మాత్రమే ఉన్నారు. వాళ్లిద్దరూ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. అంటే వైసీపీకి మ్యాజిక్ ఫిగర్ రావాలంటే కనీసం 34 సీట్లు రావాల్సిందే. మరి మ్యాజిక్ ఫిగర్ మార్కును ఈ రెండు పార్టీలు చేరుకుంటాయా.. లేదా అనేది ఈనెల 14న తేలనుంది.
    Published by:Purna Chandra
    First published: