• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • EX MP VIVEK GAVE A CLARITY THAT HE DIDNT WORK AGAINST TRS IN ELECTIONS

అన్నకిచ్చేందుకే డబ్బుల్లేవ్.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఖర్చుచేస్తానా?: వివేక్

అన్నకిచ్చేందుకే డబ్బుల్లేవ్.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఖర్చుచేస్తానా?: వివేక్

మాజీ ఎంపీ వివేక్(ఫైల్ ఫోటో)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకోసం సిన్సియర్‌గా పనిచేశానని మాజీ ఎంపీ జి. వివేక్ చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికోసం పనిచేశారంటూ తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

  • Share this:
    తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే, పలుచోట్ల సొంత పార్టీ నేతలే, అభ్యర్థుల ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నించారని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది. వారిపై గుర్రుగా ఉంది. అలాంటి నేతల లిస్టులో మాజీ ఎంపీ వివేక్ పేరు కూడా వినిపించడం రాజకీయంగా కలకలం రేపింది. కరీంనగర్‌లోని పలు శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన .. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, అభ్యర్థుల ఓటమికోసం భారీగా డబ్బులు ఖర్చు చేశారనే ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ సీనియర్ నేత, ధర్మపురి నుంచి పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్‌ను ఓడించేందుకు వివేక్ కుట్ర చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ వివేక్ తీవ్రంగా ఖండించారు.

    కేసీఆర్‌తో వివేక్ సోదరులు (ఫైల్)
    కేసీఆర్‌తో వివేక్ సోదరులు (ఫైల్)


    టీవీ‌9 న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు వివేక్. కొప్పుల ఈశ్వర్‌ను ఓడించేందుకు ప్రయత్నించాననడం అవాస్తవమన్నారు. తాను ప్రచారం చేసిన అన్ని మండలాల్లోనూ పార్టీకి మంచి మెజార్టీ వచ్చిందన్నారు. తన సోదరుడు వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ తరపున పోటీచేయడాన్ని నిలువరించలేకపోయానని, ఆ పరిస్థితులను కేసీఆర్, కేటీఆర్‌లకు వివరించానని వివేక్ చెప్పారు. వ్యాపారాల్లో భారీ నష్టం రావడం వల్ల తన దగ్గర నగదు నిల్వలే లేవని, వినోద్‌కు కూడా ఎన్నికల ఖర్చు ఇవ్వలేకపోయానని.. అలాంటిది తాను ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఓటమికోసం కోట్లు ఖర్చు చేశాననడం సమంజసం కాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు.

    కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత జి. వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన ఆయన.. మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. అయితే, ఆయన పెద్దపల్లి ఎంపీ సీటుపై హామీ పొందిన తర్వాతే పార్టీలోకి వచ్చారనే ప్రచారం ఉంది. అందుకే బాల్క సుమన్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. అయితే, తాజా ఎన్నికల్లో వివేక్ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలతో పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉంది. దీంతో ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

     
    First published: