చంద్రబాబులా జగన్ మాట్లాడటం నచ్చలేదు: ఉండవల్లి

ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్

పట్టిసీమ నీళ్లిచ్చిన చోట గన్నవరం మినహా అన్ని సీట్లలో టీడీపీ కోల్పోయిందన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషించాలన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా 26 సీట్ల నుంచే ఎదిగిందని గుర్తు చేశారు ఉండవల్లి. తెలుగుదేశం 2004లో కన్నా ఎక్కువ ఓట్లు సాధించిందన్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా ఎన్నికైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా ఉండవల్లి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... జగన్ ని జనం విశ్వసించడంతోనే చారిత్రక తీర్పువచ్చిందన్నారు. 50శాతం ఓట్లు సాధించడం ఇదే తొలిసారి అన్నారు. జగన్ పాలనలో అందుకు తగ్గట్టుగా మార్పులు రావాలని ఆయన ఆకాక్షించారు. ఢిల్లీలో జగన్ కామెంట్స్ చూస్తే వైఎస్సార్ గుర్తుకొచ్చారన్నారు. అవినీతిని రూపు మాపేందుకు ఉద్యోగుల జీతభత్యాల వివరాలు వెల్లడించాలన్నారు. జ్యుడీషియల్ కమిటీ సిఫార్స్ మేరకు బిల్లులు చెల్లించడం విప్లవాత్మకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆశించినట్టు పోర్ట్ కి అవకాశం ఇవ్వాలని జగన్‌కు సూచించారు. వాన్ పిక్ ప్రాంతంలో సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు ఉండవల్లి.

  చంద్రబాబు పాలనలో పనుల కన్నా ప్రచారం ఎక్కువ జరిగిందన్నారు. పట్టిసీమ నీళ్లిచ్చిన చోట గన్నవరం మినహా అన్ని సీట్లలో టీడీపీ కోల్పోయిందన్నారు.
  చంద్రబాబు ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషించాలన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా 26 సీట్ల నుంచే ఎదిగిందని గుర్తు చేశారు ఉండవల్లి. తెలుగుదేశం 2004లో కన్నా ఎక్కువ ఓట్లు సాధించిందన్నారు. మద్య నిషేధానికి ముందు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మోడీ కి మెజార్టీ ఉంది కాబట్టి ఏమి చేయలేమనడం సరికాదన్నారాయన. గతంలో చంద్రబాబు మాదిరే జగన్ ఈ విషయంలో మాట్లాడడం తనకు నచ్చలేదన్నారు ఉండవల్లి. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటికోసం ప్రయత్నించాలని జగన్‌కు ఆయన సూచించారు.

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటమిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి. పవన్ కళ్యాణ్ ఒక్కడైనా అసెంబ్లీలో అడుగుపెడతారేమో అని అనుకున్నానన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన పార్టీతో పాటు ఆయన కూడా రెండు చోట్ల ఓడిపోయారన్నారు. ఏదేమైనా.. కాన్షీరాం పేరు ఎక్కువగా చెబుతుంటారు కాబట్టి, కాన్షీరాంను పవన్ కల్యాణ్‌ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కాన్షీరాం కూడా మొట్టమొదట నిలబడినప్పుడు ఇదే పరిస్థితి ఎదురయ్యిందని గుర్తు చేశారు ఉండవల్లి.

  First published: