ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీపై అధికార వైసీపీ స్పష్టమైన రాజకీయ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇటు ఎన్నికల ఫలితాలతో పాటు అటు రాజకీయ విమర్శల్లోనూ టీడీపీపై వైసీపీదే అప్పర్ హ్యాండ్. అలాంటి వైసీపీని ఓ మాజీ ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందిగా మారినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు.. ఒకప్పుడు వైసీపీకి తన వాదనతో మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ జగన్ తండ్రికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఉండవల్లి అరుణ్ కుమార్.. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ... రాష్ట్రంలోని పరిణామాలు, కేంద్రంలో పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషణలు కొనసాగిస్తూ... పాలకులపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే గతంలో అధికార టీడీపీని టార్గెట్ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలాకాలం ఆ పార్టీపై పెద్దగా విమర్శలు చేయలేదు.
అయితే కొంతకాలంగా ఏపీలోని అధికార పార్టీ తీరు పట్ల ఉండవల్లి మాట తీరు మారుతోంది. వైసీపీ పాలన, జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన బాహాటంగానే తప్పుబట్టడం వైసీపీకి మింగుడుపటడం లేదు. ఏం మాట్లాడినా.. స్పష్టమైన లెక్కలు, విశ్లేషణతో అందరికీ అర్థమయ్యేలా చెప్పే ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే రకంగా అప్పులు చేస్తూ పోతే చివరకు అడుక్కుతినాల్సి వస్తుందని ఘాటగా వ్యాఖ్యానించారు.
పోలవరం సహా ఇతర అంశాలపై కూడా ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి. ఉండవల్లి చేస్తున్న ఈ వ్యాఖ్యలను టీడీపీ బాగా వినియోగించుకుంటోంది. ఆయన చెప్పే విషయాలను ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియాలో వైసీపీపై అటాక్ మొదలుపెట్టింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల దాడిని ఆ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉండవల్లిపై రాజకీయ విమర్శలు చేస్తే.. ఆయనపై మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందనే భావనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఆయనకు ఏ విధంగానూ కౌంటర్ ఇవ్వకుండా ఇదే రకంగా వదిలేస్తే..ఆయన మరింతగా తమను టార్గెట్ చేస్తారేమో అనే టెన్షన్ ఏపీ అధికార పార్టీలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్.. ఆ తరువాతే అమలు చేస్తారా ?
KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?
Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం
Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి
గతంలో టీడీపీ విధానాలను ఎక్కువగా టార్గెట్ చేసి.. వైసీపీ విషయంలో చూసీచూడనట్టు వ్యవహరించిన ఉండవల్లి.. ఇప్పుడు అందుకు రివర్స్‌లో వెళుతున్నారనే ఆందోళన వైసీపీ వర్గాల్లో మొదలైందనే చర్చ జరుగుతోంది. దీంతో ఆయనకు ఏ రకంగా చెక్ చెప్పాలనే అంశంపై అధికార పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఉండవల్లి ఇదే రకంగా వైసీపీ ప్రభుత్వంపై మాటల దాడిని కొనసాగిస్తే.. ఆయన విషయంలో పార్టీ ఏదో ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Undavalli Arun Kumar