వంద రోజుల పాలనలో జగన్ ఫెయిల్... మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

ప్రజావేదికను కూల్చి ఏం సాధించారని నిలదీశారు సబ్బం. అలా కూల్చకుండా ఆ భవనాన్ని ప్రభుత్వం వాడుకున్నా బాగుండేదన్నారు.

news18-telugu
Updated: September 1, 2019, 10:24 AM IST
వంద రోజుల పాలనలో జగన్ ఫెయిల్... మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ (Image:CMO Andhra Pradesh/twitter)
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ సబ్బం హరి.  నవరత్నాలలో ఎన్ని ప్రజలకు చేరువయ్యాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాజిటివ్‌ థృక్పథంతో వెళ్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రజావేదికను కూల్చి ఏం సాధించారని నిలదీశారు సబ్బం. అలా కూల్చకుండా ఆ భవనాన్ని ప్రభుత్వం వాడుకున్నా బాగుండేదన్నారు. ఈ రోజు వరకు కరకట్ట మీదున్న ఏ భవనాన్ని కూల్చలేదన్నారు.  సీఎం జగన్‌ ఆలోచనా ధోరణి సరిగా లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు సబ్బం హరి.

టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని వేగంతో పోలవరం పనులు చేయించారని, టీడీపీ, ఎన్డీఏ నుంచి బయటికొచ్చాక పోలవరం పనుల వేగం తగ్గిందన్నారు మాజీ ఎంపీ. ఎన్నికల ముందు పోలవరం విషయంలో వైసీపీ కేంద్రాన్ని ప్రభావితం చేసిందన్నారు. ఇప్పుడు పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రమే చెబుతోందని, రీటెండరింగ్‌కు వెళ్తే చిక్కులు వస్తాయని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు సబ్బం హరి. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని నిరూపించడానికి కుట్ర చేస్తున్నారన్నారు. అందులో భాగమే పోలవరంలో అవినీతి అంటూ తెరపైకి తెచ్చారన్నారు. జగన్‌ తన మార్క్‌ చూపించడానికి పోలవరం పనులు ఆపేయాలని చూస్తున్నారన్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 1, 2019, 10:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading