Home /News /politics /

EX MP MADHU YASHKI COMENTS ON KCR AND FAMILY

కేంద్రంలో గబ్బర్ సింగ్ ట్యాక్స్.. రాష్ట్రంలో కల్వకుంట్ల ట్యాక్స్: మధుయాష్కీ

madhu vs ktr kavita file

madhu vs ktr kavita file

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ.. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, విపక్ష నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ప్రచారంలో వేడిని పెంచుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మాధుయాష్కీ టీఆర్ఎస్‌‌పై తీవ్ర విమర్శలు చేశారు.

    టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలతో విరుచుపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. అప్పట్లో టీడీపీ టిక్కెట్ కోసం కొడుకు పేరును కూడా మార్చుకున్న నీచమైన చరిత్ర కేసీఆర్ సొంతమని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ దగ్గర మంచిమార్కులు కొట్టేసేందుకు.. అజయ్‌గా ఉన్న తన కొడుకు పేరును తారక రామారావుగా మార్చారని ఆరోపించారు.

    టీఆర్ఎస్ ను గద్దముక్కుల రాబందుల సమితిగా అభివర్ణించిన మధుయాష్కి.. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. కేంద్రంలో నరేంద్రమోదీ గబ్బర్ సింగ్ టాక్స్‌ వసూలు చేస్తుంటే.. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం కాలియా అలియాస్ కల్వకుంట్ల టాక్స్ ‌పేరిట వసూళ్లు చేస్తోందని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతూ కవిత, కేటీఆర్.. భారీ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. జనాల సొమ్మును అడ్డంగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిజాం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని.. పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పిన టీఆర్ఎస్.. హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఎంపీ కవిత కట్టుకథల కవితగా మారిపోయారని, ఉద్యమసమయంలో చేసిన దోపిడీని, వసూళ్లను ఇప్పటికీ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం భాగోతాన్ని బట్టబయలు చేస్తామని మధుయాష్కీ చెప్పారు.

    ex mp madhu yashki coments on kcr and family
    Published by:Santhosh Kumar Pyata
    First published:

    Tags: CM KCR, Congress, KTR, MP Kavitha, Telangana, Telangana Election 2018, Telangana News, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు