హోమ్ /వార్తలు /National రాజకీయం /

Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..

Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Konda Vishweshwar Reddy: విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరినా.. ఆయన టార్గెట్ మాత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

రాజకీయాల్లో నేతలు పార్టీ మార్పడం చాలా సహజం. రోజుల వ్యవధిలోనే కొందరు నేతలు కండువాలు మార్చేస్తుంటారు. వీటిని జనం కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే ఏ పార్టీలో లేని నేతలు.. రెండు ప్రధాన పార్టీలతో సన్నిహితంగా ఉండటం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. తెలంగాణలోని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు. టీఆర్ఎస్ తరపున చేవేళ్ల ఎంపీగా ఎన్నికైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఆ తరువాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి చేవేళ్ల నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఆ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే కేటీఆర్‌తో పొసగకపోవడం వల్లే విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడినట్టు ఆయన సన్నిహితవర్గాలు చెబుతుంటాయి. అయితే ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి.. మధ్యలో బీజేపీకి కాస్త దగ్గరైనట్టు కనిపించారు.

బీజేపీలో చేరడానికి దాదాపుగా సిద్ధమైనట్టు కనిపించారు. కానీ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తరువాత సీన్ మారిపోయింది. తనకు సన్నిహితంగా ఉండే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావడంతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో అధికారికంగా చేరలేదు. ఆ మధ్య బీజేపీ ముఖ్యనేత జితేందర్ రెడ్డితో కలిసి హుజూరాబాద్ వెళ్లి ఈటల రాజేందర్‌ను కలిసి వచ్చారు. దీంతో ఆయన ఇంకా బీజేపీతోనూ టచ్‌లో ఉన్నారని అంతా అనుకున్నారు.

తాజాగా రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు విసిరిన వైట్ ఛాలెంజ్‌ను తాను కూడా స్వీకరిస్తున్నానని ప్రకటించి.. పరోక్షంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచి కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ మారుతుందనే అంశంపై క్లారిటీ వచ్చిన తరువాతే.. తాను ఏ పార్టీలో చేరాలనే దానిపై విశ్వేశ్వర్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది.

Green Chilli: పచ్చి మిర్చిను దూరం పెడుతున్నారా ?..ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు

Revanth Reddy: యముడి గెటప్‌లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

అయితే ఏ పార్టీలో చేరినా.. ఆయన టార్గెట్ మాత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన రెండు పార్టీలను వినియోగించుకుంటున్నారనే టాక్ ఉంది. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి.. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతారనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Congress, Konda Vishweshwar reddy, KTR, Revanth Reddy, Telangana, Trs

ఉత్తమ కథలు