లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరం పాటిస్తున్న టీఆర్ఎస్ ముఖ్యనేత, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత... మరోసారి యాక్టివ్ అయ్యారు. తాజాగా తెలంగాణకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ధర్నా చేయడాన్ని తన ట్విట్లో ప్రస్తావించిన కవిత... సమాఖ్య స్పూర్తి అనేది కేవలం నినాదానికి మాత్రమే పరిమితం కాకూడదని ప్రధాని నరేంద్రమోదీకి తెలిపారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ సహా ఇతర బకాయిలు సమయానికి విడుదల చేయాల్సి ఉన్నా... వాటి కోసం ఎంపీలు నిరసన తెలియజేయాల్సి రావడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఈ రోజు తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. కేంద్రం నుండి 29,891 నిధులు తెలంగాణకు రావలసి ఉందని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలంటూ పార్లమెంట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ ఎంపీల నిరసన చేపట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సార్లు ప్రధానికి, కేంద్రమంత్రులను లేఖలు కూడా రాశారని నామా అన్నారు. ఇందుకోసం ఆరు సంవత్సరాల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశామని తెలిపారు. కొత్త రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని భావించామని... కానీ ఎలాంటి సహకారం అందడం లేదని నామా ఆరోపించారు. తక్షణమే తెలంగాణ కు రావల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.