Home /News /politics /

EX MP KAVITHA GIVES BIG SHOCK TO TRS LEADER IN NIZAMABAD AK

టీఆర్ఎస్ ‌నేతకు ఊహించని షాకిచ్చిన కవిత...

కవిత(ఫైల్ ఫోటో)

కవిత(ఫైల్ ఫోటో)

Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన కవిత... ఓ టీఆర్ఎస్ నేతకు ఊహించని విధంగా షాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

    నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ కూతురు కవిత రంగంలోకి దిగారు. నామినేషన్‌కు ముందు రోజు రాత్రి ఆమె పేరును ఖరారు చేశారు సీఎం కేసీఆర్. అసలు కేసీఆర్ కవితకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ విషయాన్ని ముందుగా ఊహించలేకపోయారా ? లేక అత్యుత్సాహమో తెలియదు కానీ... ఆ పార్టీకి చెందిన మరో నేత ఈ పదవికి నామినేషన్ వేశారు. ఆయనే కామారెడ్డి జిల్లాకు చెందిన నర్సింగ్ రావు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. కవిత నామినేషన్ వేయడానికి ముందు రోజు ఆయన నామినేషన్ వేశారు. ఈ విషయం చాలామందికి తెలియదు.

    అయితే పార్టీ నాయకత్వం కవిత పేరును ఖరారు చేయడంతో... ఇప్పుడు ఆయన వ్యవహారం టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు రావడం వల్లే నర్సింగ్ రావు నామినేషన్ వేశారా ? లేక ఈ విషయంలో ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారా ? అనే దానిపై చర్చ మొదలైంది. మరోవైపు ఈ విషయంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా చిక్కులు రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రోద్భలం లేకుండా నర్సింగ్ రావు నామినేషన్ వేశారా ? లేక ఆయనే ఈ విషయంలో నర్సింగ్ రావును ప్రొత్సహించారా ? అనే అంశం నిజామాబాద్ జిల్లా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    Ex mp kavitha gives big shock to trs leader in Nizamabad ak  టీఆర్ఎస్ ‌నేతకు ఊహించని షాకిచ్చిన కవిత...
    టీఆర్ఎస్ నేత నర్సింగ్ రావు(ఫైల్ ఫోటో)


    అయితే కవిత రంగంలో లేకపోతే ఆ ఛాన్స్ నర్సింగ్ రావుకు దక్కేదని... కానీ చివరి నిమిషయంలో కవిత పేరు ఖరారు కావడంతో నర్సింగ్ రావు సీటుకు ఎసరొచ్చిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ నేతకు కవిత ఊహించని విధంగా షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Kalvakuntla Kavitha, Kamareddy, Nizamabad, Telangana, Telangana mlc election

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు