హుజూర్‌నగర్ ఉప ఎన్నిక : టీఆర్ఎస్ విజయంపై కవిత కామెంట్

కల్వకుంట్ల కవిత

Huzurnagar By Election 2019 : హుజూర్‌నగర్ ఉపఎన్నికలో శానంపూడి సైదిరెడ్డి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి 69563 ఓట్లు రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి,బీజేపీ అభ్యర్థి కోట రామారావు డిపాజిట్లు కోల్పోయారు.

  • Share this:
    తెలంగాణలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అదరగొట్టింది. తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపైడి సైదిరెడ్డి.. హుజూర్‌నగర్ చరిత్రలోనే 43284ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల ప్రతికూలత ఏర్పడిందన్న వాదనలు వినిపించినప్పటికీ.. హుజూర్ నగర్ ఫలితం వాటన్నింటిని పటాపంచలు చేసింది. సైదిరెడ్డి విజయంతో టీఆర్ఎస్ వర్గాల్లో మరింత జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కవిత హుజూర్‌నగర్‌లో పార్టీ విజయంపై స్పందించారు. కేసీఆర్ గారిపై అచంచల విశ్వాసాన్ని చూపించి.. టీఆర్ఎస్‌కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ విజయం
    కోసం నిరంతర శ్రమించి టీఆర్ఎస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

    కాగా, హుజూర్‌నగర్ ఉపఎన్నికలో శానంపూడి సైదిరెడ్డి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి 69563 ఓట్లు రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి,బీజేపీ అభ్యర్థి కోట రామారావు డిపాజిట్లు కోల్పోయారు. సైదిరెడ్డి బంపర్ విక్టరీతో టీఆర్ఎస్ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. గులాబీ బాస్,సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ విజయంపై సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు.

    First published: