జర్నలిస్టు సోదరులకు మాజీ ఎంపీ కవిత విన్నపం..

కల్వకుంట్ల కవిత

కరోనాపై 24 గంటలూ పోరాడుతున్నారు జర్నలిస్టులు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు, న్యూస్, అప్‌డేట్స్.. అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారు.

  • Share this:
    కరోనాపై పోరాటంలో అందరిదీ సమాన బాధ్యత. అందులో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసుల పాత్ర గొప్పది. అయితే, వీరితో సమానంగా కరోనాపై 24 గంటలూ పోరాడుతున్నారు జర్నలిస్టులు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు, న్యూస్, అప్‌డేట్స్.. అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారెందరో ఉన్నారు. కంటికి కనిపించని ఆ మహమ్మారి ఎంతటి ఘోరాన్ని సృష్టిస్తున్నదో, ఎంతటి నష్టాన్ని కల్పిస్తున్నదో.. కంటికి కనిపించేలా చూపిస్తున్నారు జర్నలిస్టులు. కుటుంబాలను వదిలి.. ప్రజా సేవే పరమావధిగా డ్యూటీ చేస్తున్న జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు. అయితే, ఇలా కరోనాపై పోరులో తమ వంతు బాధ్యత నెరవేరుస్తున్న క్రమంలో 50 మందికి పైగా జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ప్రజలకు వార్తలు అందించే క్రమంలో వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసం చేస్తున్నారు.

    అయితే, జర్నలిస్టులకు కరోనా సోకిన ఘటన యావత్తు దేశాన్ని అలర్ట్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జర్నలిస్టు సోదరులకు పలు సూచనలతో విజ్ఞప్తి చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె ‘ముంబైలో జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరం.. విచారకరం.. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న మన జర్నలిస్టు సోదరులు మీరు జాగ్రత్త. వార్తలను మాకు అందించే క్రమంలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, కుటుంబాలను కూడా కాపాడుకోండి’ అంటూ కవిత విన్నవించారు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published: