డీకే అరుణ, లక్ష్మణ్‌లకు పోటీ... రేసులోకి మరో నేత

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీమంత్రి డీకే అరుణ గట్టిగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ రేసులో డీకే అరుణ కొద్దిగా ముందున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

news18-telugu
Updated: February 4, 2020, 12:51 PM IST
డీకే అరుణ, లక్ష్మణ్‌లకు పోటీ... రేసులోకి మరో నేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కించుకోబోయే నేత ఎవరు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో... బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీమంత్రి డీకే అరుణ గట్టిగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ రేసులో డీకే అరుణ కొద్దిగా ముందున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ రేసులోకి మరో నేత కూడా వచ్చి చేరారనే ప్రచారం మొదలైంది.

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొత్తగా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కూడా ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారని సమాచారం. ఇటీవలే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారని... ఆ సమయంలో తనకు ఈ పదవి ఇవ్వాలని కోరారని బీజేపీలో చర్చ జరుగుతోంది. తనకు ప్రధాని మోదీతో ఉండే పరిచయాలు ఇందుకోసం కలిసొస్తాయనే భావనలో జితేందర్ రెడ్డి ఉన్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.

కొంతకాలంగా ఆయన తన మనసులోని మాటను పదే పదే బయటపెడుతుండటంతో... తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి కోసం జితేందర్ రెడ్డి సీరియస్‌గానే ప్రయ్నతిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ పదవిని ఎక్కువగా హైదరాబాద్ ప్రాంత నేతలకే ఇచ్చారని... మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన సూచించినట్టు సమాచారం. అయితే డీకే అరుణ తరహాలోనే ఇతర పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన జితేందర్ రెడ్డికి ఈ కీలక పదవి లభిస్తుందా అన్నది బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు