Home /News /politics /

karimnagar mlc : టీఆర్ఎస్‌కు షాక్! -రెబల్ సర్దార్ రవీంద్ సింగ్‌ గెలుపు? -ఆయన చెప్పినవన్నీ జరిగాయి మరి!!

karimnagar mlc : టీఆర్ఎస్‌కు షాక్! -రెబల్ సర్దార్ రవీంద్ సింగ్‌ గెలుపు? -ఆయన చెప్పినవన్నీ జరిగాయి మరి!!

సీఎం కేసీఆర్ తో సర్దార్ రవీందర్ సింగ్ (పాత ఫోటో)

సీఎం కేసీఆర్ తో సర్దార్ రవీందర్ సింగ్ (పాత ఫోటో)

సీఎం కేసీఆర్ తాజాగా 18 ఎమ్మెల్సీలను భర్తీ చేయడానికి ప్రకటించిన అభ్యర్థుల్లో 13 మంది అగ్రవర్ణ నేతలకే పదవులు దక్కాయని, ఉద్యమకారులను పక్కనపెడుతోన్న కేసీఆర్ తనకు ఆర్థికంగా పనికొస్తారనుకునేవాళ్లకే అవకాశాలిస్తున్నారని, ఈ పరిణామాల క్రమంలో హుజూరాబాద్ ఫలితం కరీనంగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రిపీట్ కానుందని గోనె ప్రకాశ్ రావు అన్నారు.

ఇంకా చదవండి ...
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాలుగా మారాయి. ఎమ్మెల్సీ కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీల మాదిరిగానే స్థానిక సంస్థల కోటాలోనూ 12 ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసుకోడానికి గులాబీ దళం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 12లో కేవలం ఆరు స్థానాల్లోనే టీఆర్ఎస్ ఏకగ్రీవం ఖరారుకాగా, మిగిలిన 6 స్థానాల్లో మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు పోటీగా బరిలోకి దిగనవాళ్లలో మెజార్టీ అభ్యర్థులు ఆ పార్టీ రెబల్స్ లేదా ఇటీవలే రాజీనామాలు చేసినవాళ్లు కావడంతో డిసెంబర్ 10న జరగబోయే పోలింగ్ ఉత్కంఠగా మారింది. అన్నిటికీ మించి, కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీల్లో ఒక స్థానంలో టీఆర్ఎస్ ఓటమి తప్పదని, అక్కడ హుజూరాబాద్ (Huzurabad) ఫలితం రిపీట్ కానుందనే వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి చాలా ఏళ్లుగా కచ్చితమైన అంచనాలు చెబుతూ వస్తోన్న మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు తాజాగా కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితాలపైనా జోస్యం చెప్పారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇటీవలే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గెలవబోతున్నారని, తద్వారా సీఎం కేసీఆర్‌ (CM KCR)కు షాక్ తప్పదని గోనె అభిప్రాయపడ్డారు. కరీంనగర్ లో శనివారం మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రావు.. సీఎం కేసీఆర్ తీరుపై సంచలన విమర్శలు చేశారు. వివరాలివే..

సర్దార్ రవీంద్ సింగ్ జోరు
కరీంనగర్​ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 24 మంది పోటీపడగా.. టీఆర్ఎస్​ ముఖ్యనేతల నేతల బుజ్జగింపులతో ఆ పార్టీ రెబల్స్ లో 14 మందితో విత్ డ్రా అయ్యారు. అందుకుగానూ వీరికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత, అక్కడి రెండు స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, టి.భానుప్రసాద్ సహా మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థులు కాకుండా, మిగిలిన వాళ్లలో కరీంనగర్ మాజీ మేయర్, ​టీఆర్​ఎస్​ తిరుగుబాటు నాయకుడు​ సర్దార్​ రవీందర్​ సింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా కొనసాగుతున్నారు. హుజూరాబాద్ బీజేపీ విజేత ఈటల రాజేందర్ అండకుతోడు కాంగ్రెస్ మద్దతుతో సర్దార్ గెలవబోతున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ మాజీ చైర్మన్, రాజకీయ విశ్లేషకుడు గోనె ప్రకాశ్ రావు కూడా అదే మాట చెబుతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాబోతోందని గోనె అన్నారు. తన వాదనను బలపర్చే కీలక అంశాలనూ ఆయన వివరించారు..

shocking : మలద్వారం గుండా గాలిని పంప్ చేశారు -ఫ్యాక్టరీలో సరదాగా చేసిన పని చివరికిలా..18ఎమ్మెల్సీల్లో 13 అగ్రవర్ణాలకే
టీఆర్ఎస్ పాలనలో సాధారణ ప్రజలకే కాదు, ప్రజా ప్రతినిధులకు సైతం ముఖ్యమంత్రి దర్శనం లభించడంలేదని, సామాజిక న్యాయమే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన మాత్రమే నడుస్తోందని, ఉద్యమాకారులను పక్కన పెట్టేసిన కేసీఆర్.. ఆర్థికంగా బలవంతులైనవారిని మాత్రమే తన కోటలోకి చేర్చుకుని పదవులు అప్పగిస్తున్నారని గోనె ప్రకాశ్ రావు విమర్శించారు. తాజాగా 18 ఎమ్మెల్సీలను భర్తీ చేయగా, అందులో 13 మంది అగ్రవర్ణ నేతలకే పదవులు దక్కాయని, మిగతా సామాజిక వర్గాలకు అవకాశం కల్పించకపోవడంలో కేసీఆర్ ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు లేని కేసీఆర్.. తనకు వెన్నుదన్నుగా ఉండేవారికి మాత్రమే పదవుల తాయిలాలు పంచుతున్నారని, నిత్యం ప్రజల మధ్య ఉండే ఉద్యమ నేతలకు మాత్రం మొండి చేయిచూపిస్తున్నారని అన్నారు.

కరీంనగర్ లో శనివారం మీడియాతో మాట్లాడిన గోనె ప్రకాశ్ రావు

hyderabad : శిల్పా చౌదరి వలలో టాలీవుడ్ హీరోలు -ఈ కిలేడీది మామూలు రేంజ్ కాదు మరి!ఉద్యమ ద్రోహులకు షాక్.. హుజూరాబాద్ రిపీట్స్
‘కేసీఆర్ ఎవరినైతే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చేశాడో వాళ్లు ఎన్నికల తర్వాత ప్రజల్లో ఉండరు. అలాంటప్పుడు ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? అధికార, ధన బలంతో అన్ని ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నించారు. స్వతంత్ర అభ్యర్థులపై దాష్టీకాలు చేశారు. ప్రజాధనాన్ని తప్పుడు దారుల్లో ఖర్చుపెడుతోన్న టీఆర్ఎస్ కు ప్రజలే గుణపాఠం చెబుతారు. కరీంనగర్ లో నిరంతర ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందిన సర్దార్ రవీందర్ సింగ్ గెలుపు కేసీఆర్ కు కనువిప్పు కావాలి. ఉద్యమ ద్రోహులను తరిమి కొట్టాలి. టీఆర్ఎస్ అక్రమాలపై నేను హైకోర్టును ఆశ్రయిస్తా..’అని గోనె ప్రకాశ్ రావు అన్నారు. తెలంగాణలో పలు ఎన్నికలకు సంబంధించి చాలా కాలంగా గోనె ప్రకాశ్ రావు చెప్పిన జోస్యాలు అన్నీ ఫలించిన నేపథ్యంలో కరీంనగర్ ఎమ్మెల్సీపైనా ఆయన మాటలు నిజమవుతాయా? లేదా? అనేది డిసెంబర్ 14న తేలనుంది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Karimnagar, Mlc elections, Trs

తదుపరి వార్తలు