Ganta bye bye TDP: టీడీపీకి నమస్కారం.. గంటా శ్రీనివాసరావు రాజీనామా.. తరువాత ప్లాన్ ఇదే.. స్కెచ్ పెద్దదే..?

టీడీపీకి గంటా గుడ్ బై

Ganta Srinivasarao Resignation: రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎప్పుడు ఆయన హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. నియోజకవర్గం.. పార్టీతో సంబంధం లేకుండా విజయం సాధించగల ఏకైనా నేత ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే అని చెప్పాలి గంటా శ్రీనివాస్ రావు గురించి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. ఇక టీడీపీతో కలిసి ఉండడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేశారు. ఆ పార్టీకి అధికారికంగా బైబై చెప్పేశారు.. మరి గంటా తదుపరి ప్లాన్ ఏంటి..? 2024 టార్గెట్ గా పెద్ద స్కెచ్చే వేశారని తెలుస్తోంది..

 • Share this:
  Ganta Srinivasarao: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) గంటా శ్రీనావాస్ రావు ది సపరేట్ స్టైల్.. మరే రాజకీయ నాయకుడుకి లేని ప్రత్యేకత ఆయన సొంతం. ఆయన ఏ పార్టీ తరపున నెగ్గినా.. అధికార పార్టీలోకి చేరుతారని ముద్ర ఉంది. అలాగే ఒకసారి నెగ్గిన నియోజకవర్గం కాకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందే టాలెంట్ గంటాకే సొంతం.. అయితే అతని వ్యూహం ఈ సారి బెడిసికొట్టిందో.. లేక వ్యూహం మార్చారో కానీ.. అధికార పార్టీ కండువా కప్పుకోలేకపోయారు. కారణం ఏందైనా సాధరణ ఎమ్మెల్యేగానే రెండున్నరేళ్ల కాలాన్ని సాగదీశారు. అయితే ఈ రెండున్నరేళ్లలో తను గెలిచిన పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడైనా పాల్గొన్నారా అంటే లేదనే చెప్పాలి.. ఒకటి రెండు సందర్భాల్లో మినహా.. అయితే అలా గంటా ఉండడానికి టీడీపీ అధిష్టానం తీరే కారణమని ఆయన అనుచరుల మాట.. టీడీపీ(tdp) అధిష్టానం గంటా శ్రీనివాసరావును పట్టించుకోవడం లేదన్నది ఆయన అభిమానుల వాదన.. అయినా అధికార పార్టీలోకి వెళ్లలేక.. ఇటు టీడీపీని వీడలేక ఇంతకాలం రాజకీయంగా మౌనం పాటిస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఉక్కు ఉద్యమం మొదలైన సమయంలో.. విశాఖ ఉక్కు (Vizag Steel Plant) ఉద్యమం పేరుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దానికి టీడీపీ అధిష్టానం కూడా మద్దతు తెలిపింది. ప్రస్తుతం స్పీకర్ దగ్గర ఆయ రాజీనామా లేఖ పెండింగ్ లో ఉంది. దీంతో మరికొంత కాలం టీడీపీ ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగుతారని భావించారు. కానీ అందరికీ షాకిస్తూ ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపారు. ఇలా అవమానాలు ఎదుర్కొంటూ టీడీపీలో ఉండడం తనకు సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే

  గత రెండున్నరేళ్ల నుంచి పార్టీ మారుతారంటూ ఎప్పటికప్పుడు మీడియాకు లీకులు వచ్చినా.. ఇప్పటి వరకు ఆయన అధికారికంగా దానిపై నోరు విప్పడం లేదు. ఇప్పుడు అకస్మాత్తుగాఎమ్మెల్యే పదవికి, టీడీపీకీ రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రానికి టీడీపీ అధిష్టానానికి తమ రాజీనామా పత్రాన్ని పంపించారు..

  1999లో గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి నుండి లోక్ సభ స్థానం నుండి ఏంపిగా గెలిచారు. 2004 చోడవరం నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక పార్టీ రెండు నియోజకవర్గాలు అయిపోయాయి. 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీలో జాయన్ అయ్యారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రజా రాజ్యం తరపున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచారు. 2014లో మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైనప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. మంత్రిగా పని చేశారు. మళ్లీ 2014 వచ్చే సరికి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. 2019 లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. మూడు పార్టీలు, మూడు గుర్తులు, అయిదు నియోజకవర్గాలు, ఒక సారి ఎంపి. నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఇది గంటా రాజకీయ జీవిత చక్రం.

  ఇదీ చదవండి: గంగపుత్రుల పంట పండింది.. వలల్లో లక్షల విలువచేసే అరుదైన కోనాం చేపలు.. తింటే రుచుల విందే..! ఆరోగ్యానికి ఎంతో మేలు

  రాజీనామా నిర్ణయానికి కారణం
  ముఖ్య్డంగా తన సామాజిక వర్గంలో ఆయనకు పట్టు ఉంది. చక్రం తిప్పగలరు. వ్యూహాలను రచించగలరు. తెరవెనుక రాజకీయాలు బాగా నడపగలరని పేరు ఉంది. ఆర్ధికంగా పరిపుష్టి ఉన్న నాయకుడు కావడంతో ఆయన హవా అలా సాగుతూ వచ్చింది. ఇప్పుడు విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో ఆయనకు అనుకూలమైన పరిస్థితులు లేవంటున్నారు. ఎందుకంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉండటంతో ఆయన సైలెంట్ అయిపోయారు. టీటీపీ తరుపున తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నేతలు మాత్రమే కంఫర్ట్ గా ఉన్నారు. అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ గంటా విషయంలో టీడీపీ అధిష్టానం అస్పలు పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. మళ్లీ ఉత్తర నుంచి సీటు ఇస్తుందనే నమ్మకం లేదు.. భీమీలి నుంచి పోటీ చేద్దామన్న లోకేష్ అక్కడ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. ఇలా ఏ విధంగా చూసినా ప్రస్తుతం ఆయనకు టీడీపీ నుంచి సపోర్ట్ లేదన్నది క్లియర్ గా అర్థమవుతోంది. అందుకే ఇక టీడీపీలో ఉండడం సరైంది కాదనే నిర్ణయానికి వచ్చేశారు.

  ఇదీ చదవండి: రేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్.. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ.. రాత్రి అక్కడే బస

  ఆ కండిషన్ తో జనసేనలోకి..?
  2019లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటి నుండి వైసీపీలో వెళ్లాలని గంటా తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ సీఎం జగన్మోహనరెడ్డి ఒప్పుకోలేదని సమాచారం. గంటా వ్యవహారం జగన్ కూడా తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అధికారాన్ని అనుభవించి అధికారం కోల్పోవడంతో వేరే పార్టీకి వెళతారని తెలుసు. అందుకనే గంటాను వైసీపీలోకి రానివ్వలేదనే ప్రచారం కూడా ఉంది.. ఇటు టీడీపీలో ఉండలేక, అటు వైసీపీలోకి వెళ్లే అవకాశం లేక చూసి చూసి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ద్వారా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ వ్యూహం ఫలించలేదు. ఆయన గురించి వాళ్లు అంతగా పట్టించుకోలేదు. అయితే ఆయనకు బీజేపీ నుండి ఆహ్వానం ఉన్నప్పటికీ ఆ పార్టీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. ఆ పార్టీలో చేరినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావించి ఇప్పుడు జనసేనలో చేరాలని తెరవెనుక ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం.

  ఇదీ చదవండి:ఏపీలో విద్యుత్ సంక్షోభం.. ప్రభుత్వం కీలక సూచనలు.. ఆ సమయంలో ఏసీలు ఆపేయాలి..

  జనసేనకు వెళితే సామాజికవర్గం కలిసి వస్తుంది. సీనియర్ నాయకుడుగా తన హవా నడుస్తుంది అన్నది ఆయన భావన., అయితే జనసేనలో చేరడానికి ఓ కండిషన్ పెట్టాడని అంటున్నారు. 2024 ఎన్నికల్లో జనసేనకు టీడీపీ పొత్తు ఉంటేనే తాను జనసేనలో చేరడానికి సిద్దమని అంతర్గతంగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ పొత్తుతో జనసేన అభ్యర్ధిగా విశాఖ జిల్లాలో మరో నియోజకవర్గాన్ని ఎంచుకుని ఈజీగా విజయం సాధించవచ్చని ఆయన ధీమా. ఒక వేళ అధికారంలో వస్తే జనసేన కోటాలో మళ్లీ మంత్రి కావచ్చు అన్నది ఆయన భావనగా చెబుతున్నారు. జిల్లాలో గట్టి నాయకుడిగా పేరు ఉండటంతో పాటు చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కారణంగా జనసేన కూడా ఆయన చేరికపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి గంటా మరో పార్టీతో మరో నియోజకవర్గానికి వెళతారో లేదో వేచి చూద్దాం.
  Published by:Nagesh Paina
  First published: