Andhra Pradesh: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్.. అదే కారణమంటున్న నేత

కొల్లు రవీంద్ర

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ఇలా లేనిపోని కేసుల్లో ఇరుకిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  • Share this:
    మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు మచీలిపట్నం నియోజకవర్గంలోని చింతగుంటపాలెంలో మాజీమంత్రి కొల్లరవీంద్ర ఆందోళనకు దిగారు. ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ కొల్లురవీంద్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కానీ టీడీపీ నేతలు ఒప్పుకోలేదు. అక్రమ కూల్చివేతలు ఆగే వరకు అక్కడి నుంచి కదిలేదు లేదని తేల్చి చెప్పేశారు. దీంతో పోలీసులు వచ్చి రవీంద్రను అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించారు. అయినప్పటికీ వినకపోవడంతో పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. స్థానిక వైసీపీ నేతలు కక్ష కట్టి అనాధికారికంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని. కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని.. సామాన్యులపై ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారంటూ టీడీపీ నేతలు నిలదీశారు..

    అయితే కొల్లు రవీంద్ర అరెస్ట్ అవ్వడం ఇదే తొలి సారి కాదు. ఈ ఏడాది మార్చి నెలలో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్న కారణంగా కొల్లు రవీంద్రను అరెస్టు చేశారు. ఎన్నికల విధిలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ కొల్లు రవీంద్రపై అప్పట్లో కేసు నమోదు అయ్యింది. దీంతో తెల్లవారు జామునే మచిలీపట్నంలోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన్ను అరెస్ట్ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.  వైసీపీ నేతల పాలన చూసిన తరువాత స్థానిక ప్రజల్లో కొల్లు రవీంద్రకు ఆదరణ పెరిగిందని అందుకే ఆయన్ను పోలీసులతో పదే పదే అరెస్ట్ చేయిస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

    ఇదీ చదవండి: టీటీడీపై నటి నమిత అసంతృప్తి.. ఉద్యోగస్తులు భయపడుతున్నారని ఆవేదన

    అయితే అక్రమ అరెస్టులకు తాను భయపడేది లేదన్నారు కొల్లు రవీంద్రం. వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని.. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా పోలీసులతో బెదిరింపు ధోరణికి దిగుతున్నారని మండిపడ్డారు. కనీసం సామాన్యుల కష్టాలను మీడియాతో చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అక్రమ కేసులు పెడుతూ.. అరెస్టు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తనకు సంబంధం లేని వాటిల్లో ఇరికించి కావాలని అక్రమ కేసులు పెడుతున్నారు. ఏపీలో గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. స్థానిక మంత్రి పేర్ని సూచనల మేరకే ఇదంతా జరుగుతోందన్నారు.

    ఇదీ చదవండి: సీనియర్ మంత్రిని ఢీ కొడుతున్న ఎమ్మెల్యే.. ఆ నేత వెనుక ఉన్నది ఎవరు..?
    Published by:Nagesh Paina
    First published: