• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • EX MINSTER ASHOK GAJAPATHI RAJU STRONG COUNTER TO MP VIJAYASAI REDDY AND SANCHAITHA GAJPATHI RAJU NGS VZM

Ashok Gajapathi Raju: జీతాలు అడిగితే అరెస్టులా..? సంచయిత, విజయసాయికి స్ట్రాంగ్ కౌంటర్

సంచయిత, విజయసాయి రెడ్డికి అశోక్ గజపతి కౌంటర్

మాన్సాస్ వివాదానికి పుల్ స్టాప్ పడేది ఎప్పుడు.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వివాదం మరింత ముదురుతోంది. కోర్టు తీర్పు వచ్చిన తరువాత కూడా వివాదం ముగియలేదు. దీంతో మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు అశోక్ గజపతి రాజు..

  • Share this:
    మాన్సాస్ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. కోర్టు తీర్పు తరువాత కూడా పరిస్థితి గందరగోళంగానే ఉంది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే అశోక్ గజపతి రాజు చెప్పినట్టే.. తనకు ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా విజయనగరంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మాన్సాస్ చైర్మన్ గా తనను ఏ పనీ చేయనివ్వడం లేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్ పవర్ లేని పదవి ఎందుకని.. దీనిపై మరోసారి న్యాయపోరాటినికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇటీవల మాన్సన్స్ ఉద్యోగులు తమకు దాదాపు ఏడాదిన్నర పాటు తమకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈవోనూ చుట్టి ముట్టారు. వెంటనే అక్కడికి చేరిన పోలీసులు.. ఆందోళనలు చేస్తున్నవారిని చెదరగొట్టి.. కొందరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆవేదన చెందిన అశోక్ గజపతి రాజు.. జీతాలు అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ మండిప్డడారు.

    ప్రస్తుతం విజయనగరంలో ట్రస్టుకు సంబంధించిన అంతర్గత విషయాలు రచ్చరచ్చగా మారాయి. దీంతో ట్వీట్ వార్ స్టార్ట్ అయ్యింది. అశోక్ గజపతి రాజుకు సంచయిత గజపతి రాజు, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. వారిద్దరికీ కలిపి అశోక్ గజపతి రాజు మరో తాజా ఎన్‌కౌంటర్ ఇచ్చారు.

    మాన్సాస్ ట్రస్ట్, ఉద్యోగులపై కేసుపైనా, అలాగే సంచయిత, విజయసాయి ట్వీట్స్‌పై అశోక్ గజపతి తీవ్ర స్థాయిలో స్పందించారు. మాన్సాస్ ట్రస్టు ఈవోపై హైకోర్టులో, కోర్టు ధిక్కారణ కేసు వేయబోతున్నట్టు అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. ఈవో నిర్ణయాలు కోర్టు ధిక్కారం కిందకే వస్తాయని కామెంట్ చేశారు. సిబ్బంది జీతాల సమస్య గతంలో ఎప్పుడూ లేదని చెప్పారు అశోక్ గజపతి రాజు. జీతాల చెల్లింపుని అక్కడ అధికారులు ఓ సమస్యగా భావించటం బాధాకరమని వ్యాఖ్యానించారు. మన్సాస్ సంస్థల మనుగడ లేకుండా చేసేందుకే ఉద్యోగులకు జీతాలు ఇవ్వటంలేదని అశోక్ గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతమడిగితే ఉద్యోగులపై కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా అని నిలదీశారు. ఈవో చర్యలు సంస్ధకు ఇబ్బందికరంగా మారాయన్న అశోక్ గజపతి రాజు, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసే ముందు తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. మాన్సాస్ చైర్మన్ గా తాను అడిగిన సమాచారం కూడా ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేశారు.

    ఇటీవల ట్రస్టు ఉద్యోగులు జీతాల కోసం విజయనగరం కార్యాలయం ఎదుట ఆందోళన చేసి ఈవోను నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే నిర్బంధంపై ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అశోక్ గజపతి రాజు సీరియస్ అయ్యారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధానికి రాసిన లేఖ అర్థరహితమని కొట్టిపారేశారు అశోక్ గజపతి రాజు. తాను ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్న సమయంలోనే కూనేరు రైలు ప్రమాదం జరిగిందని వివరించారు. ఎంక్వైరీకి తనకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. మరో వైపు తాజా పరిణామాల నేపథ్యంలో కోట దగ్గర పటిష్టత భద్రత ఏర్పాటు చేశారు. ఈవో అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపడం లేదు.
    Published by:Nagesh Paina
    First published: