Eetala Rajender: బీజేపీలోకి ఈటల రాజేందర్..? ఆయన వెంటే మరికొందరు ముఖ్య నేతలు

Eetala Rajender :స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న ఈటల ..పదకొండు గంటలకు ముహుర్తం ఫిక్స్

మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్‌ పర్సన్ తులా ఉమ కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరు నేతలు ఈటలతో సమావేశమయ్యారు. అంతేకాదు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రమేష్ రాథోడ్‌ కూడా ఈ గ్రూప్‌లో ఉన్నట్లు సమాచారం.

 • Share this:
  ఈటెల రాజేందర్.. తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా ఈయన గురించే చర్చ జరుగుతోంది. ఈటల ఏం చేయబోతున్నారని అంతటా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో భవిష్యత్ కార్యాచరణపై ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కార్యకర్తల అభిప్రాయాలు, బండి సంజయ్‌‌తో చర్చలతో పాటు వివిధ సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత.. కాషాయ గూటిలో చేరారని నిర్ణయించుకున్నట్లు టీవీ9 వార్తా సంస్థ పేర్కొంది. బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖాయమైందని తెలిపింది. ఐతే ఆయనతో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా కమలం దళంలో చేరతారని సమాచారం.


  మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్‌ పర్సన్ తులా ఉమ కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరు నేతలు ఈటలతో సమావేశమయ్యారు. అంతేకాదు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రమేష్ రాథోడ్‌ సైతం ఈ గ్రూప్‌లో ఉన్నట్లు సమాచారం. అందరూ ఒకేసారి కాషాయ కండువా కప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో భేటీ అనంతరం.. బీజేపీలో చేరికపై ఈటల రాజేందర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కమలం పెద్దలు హామీ ఇచ్చారట. ఇక టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్తులతో పాటు ఉద్యమ నాయకులను బీజేపీలోకి తీసుకొస్తానని ఈటల చెప్పినట్లు తెలుస్తోంది.


  ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరికిన వెంటనే వీరంతా ఢిల్లీకి వెళ్లే అవకాశముంది. ఐతే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో బీజేపీ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తారా లేదా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నికలు వస్తే.. ఈటల రాజేందర్ పోటీచేయబోడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చి.. బీజేపీ కేంద్రమంత్రి పదవి ఇవ్వనుందన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. హుజురాబాద్‌లో ఈటల సతీమణి జమున పోటీ చేస్తారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.


  కాగా, తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను ఇటీవలే కేబినెట్‌ నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంతో పాటు మరోచోట చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో వేటువేశారు. అప్పటి నుంచి నియోజకవర్గ కార్యకర్తలతో పాటు పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో వరుసగా భేటీలు జరిపారు ఈటల. తాను ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని.. ఐతే కోవిడ్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఉపఎన్నికలతో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశముందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఐతే ఆయన కొత్త పార్టీ పెడతారా? లేదంటే ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగుతారా?మరేదైనా పార్టీలో చేరుతారా? అని కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా ఉంది. ఈ క్రమంలో అన్ని విధాలుగా ఆలోచించుకున్న తర్వాత బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: