మాజీ మంత్రి జీ.వినోద్ టీఆర్ఎస్ను వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ 105 స్థానాలకు ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో వినోద్‌కు చోటు దక్కలేదు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు టిక్కెట్‌పై వినోద్ చాలా రోజులుగా ఆశలు పెట్టుకున్నారు. అయితే చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టిక్కెట్ నిరాకరించిన టీఆర్ఎస్ అధిష్టానం...ఆ టిక్కెట్‌ను పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ టిక్కెట్‌ను వివేక్‌కు కేటాయించుందుకే బాల్క సుమన్‌ను అసెంబ్లీకి పంపాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది.
అయితే చెన్నూరు టిక్కెట్ తనకు దక్కకపోవడంతో వినోద్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ అధిష్టానం దిగిరాకుంటే టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వని పక్షంలో...కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ టిక్కెట్‌పై చిన్నూరు నుంచి పోటీ చేయాలన్నది ఆయన యోచనగా తెలుస్తోంది. వివేక్, వినోద్‌లు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే పెద్దపల్లి లోక్‌సభ టిక్కెట్‌ను వివేక్‌కు, చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ వినోద్‌కు కేటాయించేలా టీఆర్ఎస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హామీని నిలబెట్టుకోకపోవడం పట్ల లోలోన రగిలిపోతున్న వినోద్..పార్టీని వీడడమే మంచిదన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
తన అన్న వినోద్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారుడు వివేక్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. ఎలాగైనా తన అన్నకు టిక్కెట్ ఇప్పించేందుకు చివరి ప్రయత్నంగా వివేక్, కేటీఆర్ కలిసి వేడుకున్నట్లు తెలుస్తోంది. తన అన్నకు ఎలాగైనా చెన్నూరు టిక్కెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. చెన్నూరు నుంచి బాల్క సుమన్ గెలవలేరని కూడా కేటీఆర్‌కు స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. తనకు ఇస్తానన్న పెద్దపల్లి ఎంపీ సీటు తిరిగి సుమన్‌కే ఇచ్చేయండి..తనకు ఎంపీ సీటు కన్నా అన్ననే ముఖ్యమని తేల్చేశారని సమాచారం.
అయితే వినోద్‌కు చెన్నూరు టిక్కెట్ కేటాయించే విషయంలో కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయాన్ని తెలియజేసేందుకు కేటీఆర్ రెండ్రోజుల గడవు కోరినట్లు సమాచారం. దీంతో వినోద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి తిరిగి టీఆర్ఎస్కు తీసుకువచ్చినందుకు తమ్ముడు వివేక్‌పై కూడా వినోద్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన తనకు తగిన గౌరవం దక్కడం లేదని వినోద్ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టిక్కెట్లు ప్రకటించిన స్థానాల నుంచి కాకుండా వికారాబాద్(ఎస్సీ) టిక్కెట్‌ను వినోద్‌కు ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఓకే చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చెన్నూరు అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యంవహించిన వినోద్...వైఎస్సార్ కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడంతో మూడుసార్లు నల్లాల ఓదేలు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.
అన్న వినోద్ టీఆర్ఎస్ను వీడి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే...వివేక్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.