ఫలితాలకు ముందు టీడీపీకి మరోషాక్...కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి

కాంగ్రెస్, టీడీపీ ఎన్నికల గుర్తులు

కొద్ది కాలం క్రితం వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి, టిక్కెట్ రాలేదని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్త వచ్చింది.

  • Share this:
    ఫలితాలకు మరికొన్ని రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది. దీనిపై ఆ పార్టీకి మరో షాక్ కూడా తగిలింది. పార్టీకి చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లా రాజంపేట మాజీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి సాయిపత్రాప్‌ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించాకున్నారు.ఆయన కొద్ది కాలం క్రితం వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి, టిక్కెట్ రాలేదని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్త వచ్చింది. ఈ నెల 16న కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ఎపిసిసి ప్రధాన కార్యదర్శి జంగా గౌతం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయి ప్రతాప్‌ రాజంపేట ఎంపిగా ఆరు సార్లు విజయం సాధించారని తెలిపారు. ప్రస్తుతం టిడిపిలో ఉన్న ఆయన ఈ నెల 16న కడప కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎపిసిసి అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.రఘువీరా రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.తులసీరెడ్డి, కడప జిల్లా నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

    ఇటీవల పార్టీ మార్పుపై మాట్లాడిన సాయిప్రతాప్ తాను... మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరలేదన్నారు. రాష్ట్ర విభజన తీరుతో మనస్తాపం చెంది కాంగ్రెస్‌ను వీడానన్నారు. కాంగ్రెస్ పెద్దల పిలుపు మేరకు తిరిగి పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తానకు పదవులపై ఆశలేదని, చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర అభివృద్ధికి తన వంతు కృషి చే స్తానని సాయిప్రతాప్ వెల్లడించారు. జగన్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లినవారేనని గుర్తు చేశారు.
    First published: