Telangana: టీఆర్ఎస్‌లోకి మాజీమంత్రి.. ‘హుజూరాబాద్’ టికెట్‌పై కీలక వ్యాఖ్యలు

పెద్దిరెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana: టీఆర్ఎస్ నుంచి తనకు ఆహ్వానం ఉందని మాజీమంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నియోజక వర్గ ప్రజల అభివృద్ధి కొసం టీఆర్ఎస్‌తోనే సాధ్యమని అన్నారు.

  • Share this:
    బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి తనకు ఆహ్వానం ఉందని ఆయన తెలిపారు. నియోజక వర్గ ప్రజల అభివృద్ధి కొసం టీఆర్ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉంటారని అన్నారు. తాను పోటీ చేయాలా లేదా అనే అంశంపై టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీకి రాజీనామా చేసిన కొద్దిసేపటికే టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

    హుజురాబాద్‌ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినాయకత్వం పెద్దిరెడ్డికి టికెట్ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన పెద్దిరెడ్డి.. ప్రజలకు దగ్గరై పనిచేయలనుకున్న పరిస్థితులు బీజేపీలో లేవని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకునే సమయంలో తనకు సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనను పార్టీలో చేర్చుకున్న విధానం కరెక్ట్ కాదని పెద్దిరెడ్డి అన్నారు.

    ఇక ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన తరువాత పెద్దిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈటల రాకను వ్యతిరేకించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం దాదాపు ఖాయం కావడంతో.. ఆయన ఎప్పుడు గులాబీ కండువా కప్పుకుంటారా ? అన్నది వేచి చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: