టీడీపీకి మరో షాక్... రాజీనామా చేసిన మాజీ మంత్రి

వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ పరిస్థితులే తన రాజీనామాకు కారణమని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.

news18-telugu
Updated: July 14, 2019, 3:44 PM IST
టీడీపీకి మరో షాక్... రాజీనామా చేసిన మాజీ మంత్రి
టీడీపీ ఎన్నికల గుర్తు
news18-telugu
Updated: July 14, 2019, 3:44 PM IST
టీడీపీకి మరో నేత గుడ్ బై చెప్పారు. ఈ మేరకు చంద్రబాబుకు రాజీనామా లేఖ కూడా పంపారు. మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య... టీడీపీ సభ్యత్వానికి రాజీనామా  చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి మూడు సార్లు పోటీ చేసి గెలిచిన పట్నం సుబ్బయ్య దివంగత సీఎం ఎన్టీఆర్‌తో పాటు  చంద్రబాబు హయాంలో కూడా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

తాజాగా ఆయన టీడీపీని వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తన ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు పట్నం సుబ్బయ్య ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ పరిస్థితులే తన రాజీనామాకు కారణమని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ లేఖను జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానీకి, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ-మెయిల్‌ ద్వారా పంపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత తెలుగుదేశం పార్టీకి పలువురు దూరమవుతున్న సంగతి తెలిసిందే. ఇటు బీజేపీ నేతలు కూడా రానున్న రోజుల్లో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో  రాజీనామాల పర్వం టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...