Home /News /politics /

EX MINISTER PARITALA SUNITHA SENSATIONAL COMMENTS IN CHANDRABABU NAIDU DEEKSHA SK

Paritala Sunitha: చంద్రబాబు మారాలి.. మాదీ సీమ రక్తమే.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు నాయుడు, పరిటాల సునీత

చంద్రబాబు నాయుడు, పరిటాల సునీత

Paritala sunitha: తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి పరిటాల సునీత . చంద్రబాబు మారాలని.. అనుమతి ఇస్తే తమ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు.

    ఏపీలో నేతల  మాటల మంటలు చల్లారడం లేదు. పట్టాభి (TDP Leader pattabhi) ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు దీక్ష (Chandrababu deeksha), వైపీపీ ఆందోళనల(YSRCP protests)తో రోజు రోజూకూ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు, హెచ్చరికలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం చంద్రబాబు దీక్షకు హాజరైన ఆమె.. వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు మారాలని.. అనుమతి ఇస్తే తమ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు.

    '' వైసీపీ నేతలు చంద్రబాబును ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.  ఆయన చెప్పారు కాబట్టి మే ఓర్పుతో ఉన్నాం.  నా భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉన్నామన్నారు కాబట్టే ఉన్నాం. చంద్రబాబు మీరు మారాలి. మేం అధికారంలోకి వచ్చాక మీకు చుక్కలు చూపిస్తాం. చంద్రబాబు సీఎం అయ్యాక గంట కళ్లు మూసుకుంట మా ప్రతాపమేంటో చూపిస్తాం. మాలో ప్రవహించేది కూడా సీమ రక్తమే. చంద్రబాబు ఓకే దేనికైన సిద్ధమే.''అని ఆవేశంగా మాట్లాడారు పరిటాల సునీత.

    AP Political Fight: వైసీపీ - టీడీపీ పోటాపోటీ దీక్షలు... ఎవరికి ప్లస్.. ఎవరికి

    మంగళగిరిలోని టీడీపీ కేంద్ర  కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి దీక్ష కొనసాగిస్తున్నారు. టీడీపీ ఆఫీసుతో పాటు ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై దాడికి నిరసనగా దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరాటం పేరుతో చంద్రబాబు చేపట్టిన ఈ దీక్షకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి.  పార్టీ నేతలు కూడా దీక్షా వేదికపై కూర్చుతున్నారు. సీపీఐ నారాయణ వంటి ఇతర పార్టీ నాయకులు కూడా చంద్రబాబుకు ఫోన్ కాల్ చేసి దీక్షకు మద్దతు తెలుపుతున్నారు.

    Janasena-Pawan Kalyan: పవన్ రాజకీయ వ్యూహం మారబోతోందా..? ఆ పార్టీకి షాకివ్వబోతున్నారా..?

    ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టీడీపీ నేత పట్టాభి అసభ్య పదజాలంతో దూషించడంతో ఏపీలో  ఈ రచ్చ మొదలయింది. ఆయన వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంతో పాటు పట్టాభి ఇంటిపైనా దాడి చేశారు. ఆ ఘటనలను నిరసిస్తూ బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఐతే టీడీపీ ఆందోళనలకు పోటీ వైసీపీ కూడా ప్రజాగ్రహం పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదే రోజు సాయంత్రం పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు గురువారం ఉదయం 8 గంటల నుంచి 36 గంటల పాటు దీక్ష చేస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు దీక్ష ముగుస్తుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Paritala sunitha

    తదుపరి వార్తలు