చంద్రబాబు ఇల్లు ముంచడానికి కుట్ర... నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు?’ అంటూ లోకేష్ ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: August 16, 2019, 3:47 PM IST
చంద్రబాబు ఇల్లు ముంచడానికి కుట్ర... నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
• Share this:
కృష్ణానదిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచడానికి భారీ కుట్ర జరిగిందని ఆరోపించారు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్. దీనిపై వైసీపీ ప్రభుత్వాన్ని సంచలన ఆరోపణలు చేస్తూ లోకేష్ ఓ ట్వీట్ పెట్టారు. ’చంద్రబాబుగారి ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూరాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు?’  అంటూ లోకేష్ ఆరోపణలు చేశారు.

వైసీపీ నేతల శాడిజం అంతా సాక్షి పైశాచిక రాతల్లో కనపడుతుందని నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబుగారి నివాసంలోకి వరదనీరు అంటూ అవుట్ హౌస్ ఫోటో పెట్టి కథనం రాశారని విమర్శించారు. హై సెక్యూరిటీ కలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రి అవుట్ హౌస్ లో ఉంటారా? అయినా అవుట్ హౌస్ కు చంద్రబాబుగారి నివాసానికి మధ్య ఎంత దూరం ఉందో చూడండి అంటూ మరో వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు లోకేష్. దీంతో పాటు.... చంద్రబాబు ఇంటిపై తిరిగిన డ్రోన్ కెమెరాల అంశంపై కూడా ఆయన స్పందించారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగిరాయి అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబుగారి
ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూరాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి
వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ
తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు? pic.twitter.com/5GAe8nmk4K

Lokesh Nara (@naralokesh) August
16, 2019

వైసీపీ నేతల
శాడిజం అంతా సాక్షి పైశాచిక రాతల్లో కనపడుతుంది. చంద్రబాబుగారి నివాసంలోకి
వరదనీరు అంటూ అవుట్ హౌస్ ఫోటో పెట్టి కథనం రాసింది సాక్షి. హై సెక్యూరిటీ
కలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రి అవుట్ హౌస్ లో ఉంటారా? అయినా అవుట్ హౌస్ కు
చంద్రబాబుగారి నివాసానికి మధ్య ఎంత దూరం ఉందో చూడండి. pic.twitter.com/jBzvP8yxcW

Lokesh Nara (@naralokesh) August
16, 2019

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు