Tirupati Loksabha by-poll:తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. మాజీ మంత్రి సంచలన ప్రకటన.. వైఎస్ హయాంలో మంత్రిగా చేసి..

ప్రతీకాత్మక చిత్రం

అధికార వైసీపీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది ఇంకా బయటపెట్టలేదు. అయితే తాజాగా ఓ మాజీ మంత్రి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానంటూ ప్రకటించి..

 • Share this:
  పంచాయతీ ఎన్నికలతో ఏపీలో రాజకీయ సెగలు పుట్టాయి. ఆ తర్వాత జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో పార్టీల మధ్య పోరు తీవ్రమయింది. ఇక రానున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలపైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది కానీ, ఏ నిమిషంలో అయినా అభ్యర్థి మార్పుపై నిర్ణయం తీసుకుంటుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో జనసేన-బీజేపీ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని తాజాగా నిర్ణయం కూడా తీసుకున్నారు. అధికార వైసీపీ మాత్రం ఈ సీటులో పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది ఇంకా బయటపెట్టలేదు. అయితే తాజాగా ఓ మాజీ మంత్రి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానంటూ ప్రకటించి చర్చనీయాంశంగా నిలిచారు.

  మూలింటి మారెప్ప.. ఒకప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేత. వైఎస్ హయాంలో, ఆయన కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. 30 ఏళ్లుగా ఆంధ్రా రాజకీయాల్లో ఉన్నారు. శుక్రవారమే ఆయన భారతీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందిరాగాంధీ ఆశయాలతో ఏర్పడిన భారతీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయమై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఢిల్లీలో భారతీయ ప్రజా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్, జాతీయ ప్రధాన కార్యదర్శి హరినాథ్ గుప్తాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో జగన్ పాలనపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  Ex Minister Mareppa joined in Indian Praja Congress and released statement about contesting in Tirupati Parliament Bypoll తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. మాజీ మంత్రి సంచలన ప్రకటన.. వైఎస్ హయాంలో మంత్రిగా చేసి..
  మాజీ మంత్రి మారెప్ప (ఫైల్ ఫొటో)

  ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల్లో ఎంత తేడా ఉందంటే..!

  ‘ఎంగిలి మెతుకుల్లాంటి సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారు. ప్రజలకు ప్రాజెక్టులు, పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. అంతేకానీ తాత్కాలిక ప్రయోజనాలనిచ్చే అనుచిత సంక్షేమ పథకాలు కాదు. నేను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. మంత్రిగా కూడా పనిచేశా. ఎంతో నిజాయితీగా ఉన్నా. భారతీయ ప్రజా కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమని నమ్మాను. అందుకే ఈ పార్టీలో చేరాను. జగన్ పాలనలో ఇసుమంతైనా ఏపీలో అభివృద్ధి జరగలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం చాలా ఘోరం. దీనిపై ప్రభుత్వం సరిగా స్పందించలేకపోతోంది‘ అని మారెప్ప వ్యాఖ్యానించారు.
  ఇది కూడా చదవండి: రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!

  అదే సమయంలో తాను తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నానని మారెప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆమె అంత యాక్టివ్ గా ప్రచారం చేయడం లేదన్న భావన పార్టీలో కలుగుతోంది. దీంతో అభ్యర్థిని మార్చుతారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే సమయంలో శుక్రవారమే బీజేపీ-జనసేన కూటమి తరపున కాషాయ పార్టీ అభ్యర్థే బరిలో ఉంటారని తేల్చారు. ఇటు అధికార వైసీపీ కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటామన్న ధీమాతో ఉంది. దీంతో ఇప్పటికే త్రిముఖ పోరు ఉంటుందన్న అంచనాలు ఉంటే, మాజీ మంత్రి మారెప్ప పోటీ కాస్తా చతుర్ముఖ పోరును తీసుకొస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో? తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో వేచి చూడాలి.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ లోని ఓ యువతిపై అమెరికా నుంచి తెలుగు టెకీ ఫిర్యాదు.. ఆమె గురించి ఆరా తీసిన పోలీసులకే..
  Published by:Hasaan Kandula
  First published: