• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • EX MINISTER KOLLU RAVEENDRA GRANTED BAIL AFTER ARRESTED BY POLICE AND JUDGE COMMENTS THAT POLICE NOT FOLLOWED PROCEDURE FULL DETAILS HERE PRN

Andhra Pradesh: మాజీ మంత్రికి బెయిల్.. పోలీసులకు షాకిచ్చిన జడ్జి

Andhra Pradesh: మాజీ మంత్రికి బెయిల్.. పోలీసులకు షాకిచ్చిన జడ్జి

కొల్లు రవీంద్ర

మచిలిపట్నం 25వ డివిజన్‌ సర్కిల్‌పేటలోని పోలింగ్‌ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర (Kollu Raveendra) తన అనుచరులతో కలిసి వెళ్లారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మ్జూరైంది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆయన స్వగృహంలో గురువారం ఉదయం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కారణంగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతారవణం చోటు చేసుకుంది. పోలీసులు ఆయపై 356, 56, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం జిల్లా కోర్టుకు తరలించగా.. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఐతే కొల్లు రవీంద్ర అరెస్ట్, కేసులు నమోదు చేసే అంశంలో పోలీసులు సరైన ప్రొసీజర్ అమలు కాలేదని అభిప్రాయపడిన కోర్టు.. కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు విడుదల చేశారు.

    ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ''వైసీపీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నoదుకు నాపై అక్రమ కేసులు పెడుతున్నారు. నిన్న నా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లిన నాపై వైసీపీ వారే దురుసుగా ప్రవర్తించారు. నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదని హౌస్ అరెస్ట్ అని చెపితే నేను ఇంట్లోనే ఉన్నాను. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నన్ను పోలీసులు మీడియాతో మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు పెట్టారు. సంబంధం లేని వాటిల్లో నన్ను ఇరికించి కావాలని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. శివరాత్రి రోజున నది స్నానానికి వెళ్లి పితృదేవతలకు పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మంత్రి పేర్ని నన్ను ఇబ్బంది పెట్టాలని నాపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారు''. అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

    ఇది చదవండి: తొమ్మిదో తరగతికే డ్రగ్స్... ఏపీలో విస్తరిస్తున్న మాఫియా



    బుధవారం ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మచిలిపట్నం 25వ డివిజన్‌ సర్కిల్‌పేటలోని పోలింగ్‌ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర, తన అనుచరులతో కలిసి వెళ్లారు. తాను లోపలికి వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలించాలని పోలీసులతో చెప్పాడు. కానీ పోలీసులు అంగీకరించలేదు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున లోపలికి పంపించమని స్పష్టం చేయడంతో.. వారితో కొల్లు రవీంద్ర వాగ్వాదానికి దిగాడు. నన్నే ఆపుతావా...అని మండిపడ్డారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

    ఇది చదవండి: ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్... 2లక్షల మందికి క్యాష్ ప్రైజ్



    కాగా, కొల్లు రవీంద్ర గత ఏడాది కూడా అరెస్ట్ అయ్యారు. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన ఏ-4గా ఉన్నారు. జూన్ 29న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మార్కెట్‌లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. మోకాను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ రావడంతో ఆగస్టు 26న ఆయన విడుదలయ్యారు.
    Published by:Purna Chandra
    First published: