టీఆర్ఎస్‌కు జూపల్లి ఝలక్... రెండు మున్సిపాలిటీల్లో జోరు

కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపి వారికి గెలిపించుకోవడంలో మాజీమంత్రి జూపల్లి విజయం సాధించారు.

news18-telugu
Updated: January 25, 2020, 11:46 AM IST
టీఆర్ఎస్‌కు జూపల్లి ఝలక్... రెండు మున్సిపాలిటీల్లో జోరు
మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు(ఫైల్ ఫోటో)
  • Share this:
టీఆర్ఎస్‌కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తన సత్తా ఏంటో చూపించారు. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపి వారికి గెలిపించుకోవడంలో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో తనవారికి కాకుండా వేరే వాళ్లకు పార్టీ టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూపల్లి... కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 స్థానాల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపారు. వారిలో 16 మంది విజయం సాధించడం విశేషం. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆయన మద్దతుదారుల సొంతమైంది. ఇక ఐజా మున్సిపాలిటీ పరిధిలోనూ జూపల్లి అనుచరుల హవా కొనసాగింది.

ఇక్కడ మొత్తం 20 వార్డుల్లో తన మద్దతుదారులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపిన జూపల్లి... వారిలో పది మందిని గెలిపించుకోవడంతో... ఇక్కడ కూడా ఆయనే కింగ్ మేకర్‌గా మారారు. మొత్తానికి కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన పట్టు నిలుపుకున్న జూపల్లి కృష్ణారావు... టీఆర్ఎస్‌కు తన బలమెంతో చూపించినట్టయ్యింది.
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు