టీఆర్ఎస్‌కు బిగ్ షాకిచ్చిన మాజీమంత్రి...

తన నియోజకవర్గంలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులకు జూపల్లి కృష్ణారావు మద్దతు ప్రకటించడం... వారిని గెలిపించాలని ప్రచారం చేయడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: January 16, 2020, 6:27 PM IST
టీఆర్ఎస్‌కు బిగ్ షాకిచ్చిన మాజీమంత్రి...
కేసీీఆర్, కేటీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్‌ను బుజ్జగించి బరి నుంచి తప్పించాలని భావిస్తున్న టీఆర్ఎస్‌కు ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఊహించని షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఆయన మద్దతు ప్రకటించడం... వారిని గెలిపించాలని ప్రచారం చేయడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో... అక్కడ టీఆర్ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక, వారికి బీఫామ్‌లు ఇచ్చే బాధ్యతను ఆయనకే అప్పగించింది గులాబీ బాస్.

దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జూపల్లి కృష్ణారావు... తన వర్గం వారిని కొల్లాపూర్‌లోని మొత్తం 20 వార్డుల్లో పోటీ పెట్టారు. వారందరినీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున సింహం గుర్తుపై పోటీకి నిలబెట్టిన జూపల్లి కృష్ణారావు... పట్టణంలో సింహం గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. జూపల్లి తీరుపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి... ఆయన తన మద్దతుదారులకు ప్రచారం చేస్తున్న ఫోటోలు, వీడియోలను కేటీఆర్‌కు అందించినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌కు బిగ్ షాకిచ్చిన మాజీమంత్రి... | Ex minister jupally Krishna rao gives big shock for ktr and kcr in municipal elections 2020 ak
జూపల్లి బొమ్మతో కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ రెబల్స్ ప్రచారం


వాస్తవానికి గతంలోనే దీనిపై కేటీఆర్‌కు హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేయగా... రెబల్స్‌ను బరి నుంచి తప్పించాలని మంత్రి కేటీఆర్ జూపల్లిని కోరారు. అయితే నామినేషన్లు విత్ డ్రా సమయానికి వారితో విత్ డ్రా చేయిస్తానని చెప్పిన జూపల్లి... వారంతా పోటీలో ఉండేలా చేయడం టీఆర్ఎస్‌లో గుబులు రేపుతోంది. మొత్తానికి టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలను లైట్ తీసుకుని ముందుకు సాగుతున్న జూపల్లి కృష్ణారావు విషయంలో ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం పార్టీ వర్గాలతో పాటు జిల్లా రాజకీయాల్లోనే ఆసక్తి నెలకొంది.First published: January 16, 2020, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading