EX MINISTER JUPALLI KRISHNA RAO COMMENTS ON DISSATISFACTION OVER MINISTRY BS
టీఆర్ఎస్లో అసంతృప్తిపై మాజీ మంత్రి హాట్ కామెంట్స్.. పదవిని త్యాగం చేశానంటూ..
జూపల్లి కృష్ణారావు (ఫైల్)
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నిఖార్సయిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయంటూ వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో పలువురు ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నిఖార్సయిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని తెలిపారు. తాను గులాబీ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారతానంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి కూడా స్పందించారు. తన నాయకుడు కేసీఆరేనని, ఆయనతోనే తాను చివరి వరకు ఉంటానని తేల్చి చెప్పారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని అన్నారు.
మరోవైపు, మాజీ మంత్రి రాజయ్య కూడా టీఆర్ఎస్లో అసంతృప్తిపై మాట్లాడారు. దళితులకు పదవి రాలేదని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మీడియా చిట్‌చాట్‌లో అన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో స్వయంగా మాజీ మంత్రి రాజయ్య మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తాను అనని మాటలను మీడియాలో చూపించడం బాధ కలిగించిందని చెప్పారు. కేసీఆరే తమ నాయకుడని.. మాదిగలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని.. తనను తెలంగాణ రాజన్నగా తీర్చిదిద్దారని కొనియాడారు. మాదిగ బిడ్డగా తనను గుర్తించి తెలంగాణకు తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశమిచ్చారని వెల్లడించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.