నెక్ట్స్ అరెస్ట్ ఆయనే.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. తెరపైకి సైకిల్ స్కామ్

ఇప్పటికే మాజీ మంత్రి గంటాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. స్కూల్ పిల్లల కోసం కొనుగోలు చేసిన సైకిళల్లో 5 కోట్ల అవినీతి జరిగిందని జులై 15న ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: July 17, 2020, 11:16 AM IST
నెక్ట్స్ అరెస్ట్ ఆయనే.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. తెరపైకి సైకిల్ స్కామ్
అవంతి శ్రీనివాస్ (File)
  • Share this:
ఏపీలో అరెస్ట్‌ల రాజకీయం కొనసాగుతోంది. టీడీపీ నేతల అరెస్ట్‌పై ఇప్పటికే తీవ్ర దుమారం రేగుతోంది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్ట్‌పై వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైఎస్ జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌తో పాటు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విశాఖలో మాట్లాడిన అవంతి.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడరని.. ఆయన అరెస్ట్ ఖాయమని అన్నారు.

చంద్రబాబు హయంలో అన్నీ కుంభకోణాలే జరిగాయి. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు అనుచరులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క గజం కూడా ఆక్రమణకు గురికాలేదు. విశాఖలో రూ.400 కోట్ల భూమి అన్యాక్రాంతం కాకుండా చూశాం.
అవంతి శ్రీనివాస్, ఏపీ మంత్రి


ఇప్పటికే మాజీ మంత్రి గంటాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. స్కూల్ పిల్లల కోసం కొనుగోలు చేసిన సైకిళల్లో 5 కోట్ల అవినీతి జరిగిందని జులై 15న ట్వీట్ చేశారు. ఆ మరుసటి రోజే అవంతి శ్రీనివాస్ కూడా గంటాపై విమర్శలు చేశారు. గంటా శ్రీనివాస్ అరెస్ట్ కాక తప్పదని స్పష్టం చేశారు.

గంటా శ్రీనివాస రావుపై తాజాగా మరో ట్వీట్ వదిలారు విజసాయిరెడ్డి. గత ప్రభుత్వం హయంలో లక్షా 82వేల మందికి సైకిల్ పంచినట్లు రికార్డులో చూపిస్తున్నారని..ఐనా ఇప్పటికీ 30-40 ఏళ్ల నాటి సైకిళ్లే రోడ్ల మీద కనిపిస్తున్నాయని విమర్శించారు. అసలు ఎంత మందికి సైకిళ్లు అందాయో దర్యాప్తులో తేలుతుందని ట్వీట్ చేశారు.
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో అచ్చెన్నాయుడు, వైసీపీ నేత మోకా హత్య కేసులో కొల్లు రవీంద్ర ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇక గంటా శ్రీనివాస్ సైకిళ్ల స్కామ్‌కు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ఆరోపించడం.. నెక్ట్స్ ఆయనే అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో... త్వరలోనే గంటా శ్రీనివాస్ రావు అరెస్ట్ కావడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: July 17, 2020, 11:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading