చంద్రబాబును పట్టించుకోని టీడీపీ మాజీమంత్రి ?

స్వయంగా చంద్రబాబే విశాఖకు వచ్చినా గంటా కనిపించకపోవడం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం నిర్భందించి తిప్పి పంపించినా... గంటా స్పందించలేదు.

news18-telugu
Updated: February 28, 2020, 7:02 PM IST
చంద్రబాబును పట్టించుకోని టీడీపీ మాజీమంత్రి ?
చంద్రబాబు నాయుడు (ఫైల్)
  • Share this:
ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీలో పూర్తిగా సైలెంట్ అయిపోయిన నాయకుడు, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే గంటా బీజేపీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పలు అనేక సార్లు కొనసాగింది. అయితే తాను పార్టీ మారబోనని గంటా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయినా ఆయన పార్టీ మారతారనే పుకార్లు మాత్రం ఆగలేదు. ఇందుకు ప్రధాన కారణం... ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోవడమే. అసెంబ్లీలోనూ ఆయన పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. ఏదో అలా మొక్కుబడిగా అసెంబ్లీకి వచ్చి వెళ్లిపోయారు గంటా.

విశాఖను రాజధాని చేయడాన్ని స్వాగతించిన గంటా... తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని ఆ మధ్య చెప్పారు. దీంతో గంటా పార్టీ మార్పు ఇప్పట్లో ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. అయితే తాజాగా చంద్రబాబు విశాఖ పర్యటనలో గంటా శ్రీనివాసరావు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న విశాఖలో చంద్రబాబును ఎయిర్ పోర్ట్ దగ్గరే అడ్డగించాయి వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ కూడా జరిగింది. చంద్రబాబుకు బాసటగా నిలిచేందుకు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీమంత్రి అచ్చెన్నాయుడు వంటి వాళ్లు అక్కడ కనిపించారు.

ఏపీలో స్థానిక ఎన్నికలు,విశాఖ మున్సిపల్ ఎన్నికలు,జీవీఎంసీ,విశాఖ ఎన్నికలు,గంటా శ్రీనివాసరావుకు షాక్,నారాయణకు ఉత్తరాంధ్ర పగ్గాలు,జగన్ న్యూస్,టీడీపీ న్యూస్,
చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)


కానీ అక్కడ గంటా మాత్రం కనిపించలేదు. స్వయంగా చంద్రబాబే విశాఖకు వచ్చినా గంటా కనిపించకపోవడం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం నిర్భందించి తిప్పి పంపించినా... గంటా స్పందించలేదు. టీడీపీ తరపున ఈ చర్యను ప్రతిఘటించేందుకు ప్రయత్నించలేదు. దీంతో అసలు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరి ఏమిటన్నది ఆ పార్టీ నేతలకు కూడా అంతుచిక్కడం లేదు.

జిల్లా నుంచి మంత్రి పదవి కావాలంటే సీనియర్ అంటూ ముందు వరుసలో నిలిచే గంటా శ్రీనివాసరావు... పార్టీ అధినేతకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా ఇటు వైపు రాకపోవడం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కొందరైతే.. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఏకంగా చంద్రబాబును కూడా పట్టించుకోవడం లేదని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి... ఈ మొత్తం వ్యవహారంపై గంటా శ్రీనివాసరావు స్పందిస్తారేమో చూడాలి.
Published by: Kishore Akkaladevi
First published: February 28, 2020, 7:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading