టీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకున్న ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రెస్మీట్లో బీజేపీలో చేరిక గురించి ఆయన మాట్లాడలేదు. ఐతే మీడియాతో చిట్ చాట్ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపైనా క్లారిటీ ఇచ్చారు. బీజేపీలో చేరికపై మరింత స్పష్టత ఇచ్చారు. మరోం వారం రోజుల్లో బీజేపీలో చేరతానని తెలిపారు. తాను బీజేపీలోకి వెళ్లిన తర్వాత చాలా మంది ఉద్యమకారులు పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఈటల రాజేందర్‌తో పాటు ఏనుగు రవీందర్, తులా ఉమ, మరికొందరు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరతారని సమాచారం.
''నాది లెఫ్ట్ భావజాలమైనా ప్రస్తుత పరిస్థితులు బీజేపీ వైపు నడిపించాయి. ఢిల్లీలో బీజేపీ నేతలందరీనీ కలిశా. అమిత్ షాతో ఫోన్లో మాట్లాడాను. వారం రోజుల తర్వాత బీజేపీలో చేరిక ఉంటుంది. నేను బీజేపీలో చేరిన తర్వాత చాలా మంది ఉద్యమకారులు బీజేపీలోకి వస్తారు. పరిస్థితులు చక్కబడ్డాక బహిరంగ సభ నిర్వహిస్తాం. స్పీకర్ సమయం ఇస్తే నేరుగా కలిసి రాజీనామా లేఖను అందజేస్తా.'' అని ఈటల రాజేందర్ అన్నారు.
శుక్రవారం శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాలో మాట్లాడిన ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో మంత్రి పదవి.. బానిస కంటే దారుణంగా మారిందని విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్ పేరును 'బానిసల నిలయం'గా మార్చుకోవాలని విమర్శలు గుప్పించారు. ఒక్క మంత్రి పదవి ఇచ్చి బానిసలా బతకమంటే.. తాను బతకలేనని ఈటల స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, గజకర్ణ గోకర్ణ టక్కుటమారా విద్యలను హుజురాబాద్ ప్రజలు బొంద పెడతారని అన్నారు. హరీష్ రావు, వినోద్ రావు వచ్చినా ఏం చేయలేరని తెగేసి చెప్పారు ఈటల రాజేందర్. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు లొంగేవారు కాదని.. ఆత్మగౌరవం కోసం కొట్లాడేవారని ఆయన స్పష్టం చేశారు.
ఈటల వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈటలను ప్రగతిభవన్‌లోకి రానీయకుంటే.. అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. ఆస్తులను కాపాడుకునేందుకే.. ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారని మండిపడ్డారు. అమాయక ప్రజల భూములను లాక్కొని.. వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారని ఈటల రాజేందర్‌పై విరుచుకుపడ్డారు. ఢిల్లీ పెద్దలు కాదు కదా.. మళ్లీ వచ్చిన కేసీఆర్‌ను వేడుకున్నా.. ఎవరూ కాపాడలేరని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌తో పాటు యావత్ తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.