సాములోరు చెప్పారని శెనగలు ఇవ్వొద్దు... దేవినేని ఉమా

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కోటా కింద ఇచ్చే సరుకుల్లో కందిపప్పు స్థానంలో శనగపప్పు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, స్వామీజీ చెప్పినందు వల్లే ఇలా చేస్తున్నారంటూ ఆ మహిళ ఆరోపించినట్టు దేవినేని ఉమా అన్నారు.

news18-telugu
Updated: April 18, 2020, 7:38 PM IST
సాములోరు చెప్పారని శెనగలు ఇవ్వొద్దు... దేవినేని ఉమా
ఏపీ మంత్రి దేవినేని ఉమా (ఫైల్ ఫోటో )
  • Share this:
కరోనా నేపథ్యంలో ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. జి.కొండూరు మండలంలోని చెరువు మాధవరం, ఛేగిరెడ్డిపాడు, కందులపాడు, ముత్యాలంపాడు, ఆత్కూరు గ్రామాల్లో.. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గుంటుపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల ఆర్థిక సహకారంతో ఆయా గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి నిత్యవసరవస్తువులు, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లను పంపిణీ చేశారు. పేదలు ఈ సమయంలో రూపాయి కూడా సంపాదించుకోలేరు కాబట్టి మూడు నెలలకు సరిపోయే విధంగా నిత్యవసరాలు అందించి, ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో శనగలు దానం చేస్తే పుణ్యం రాదని, కందిపప్పు ఇస్తే ఉపయోగపడుతుందని, ఎవరో సాములోరు చెప్పారని శనగలు ఇవ్వద్దని, సి.హెచ్ మాధవరంలో పార్వతి అనే సామాన్య గృహిణికి ఉన్నపాటి జ్ఞానం కూడా శనగలు అందజేసే ప్రభుత్వానికి అధికారులకు లేకుండా పోయిందని ఆరోపించారు.

పులివెందుల అరటిపళ్లు తెచ్చి డ్వాక్రా మహిళలతో 20 నుంచి 25 రూపాయలు వసూలు చేస్తున్నారని ధారావత్ శ్రీను అనే వ్యక్తి ఉమా దృష్టికి తీసుకురాగా గతంలో ఇదే డ్వాక్రా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయించామని ఇప్పడాపని ప్రభుత్వం ఎందుకు చేయించలేకపోతుందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల మద్య సమన్వయం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి డ్వాక్రా సంఘాల ద్వారా మామిడిని కొనుగోలు చేయించాలని కోరారు. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలను, రైతులను ఆదుకోవాలన్నారు.
First published: April 18, 2020, 7:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading