2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ ?

పదే పదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. ఈనేపథ్యంలో రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు జరుగుతాయన్నారు.

news18-telugu
Updated: September 2, 2019, 12:49 PM IST
2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.  2024 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతాయని మాజీ మంత్రి , టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు జోస్యం చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పదే పదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. ఈనేపథ్యంలో రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు జరుగుతాయన్నారు.

ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు(File)
ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు(File)


మరోవైపు  బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ దోస్తీ కొనసాగుతోందన్న ఆరోపణలకు అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుక టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ పోటీచేసిన మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. మరోవైపు ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. అవినీతి కేసుల నుంచి చంద్రబాబును కాపాడేందుకే వీరు బీజేపీలో చేరారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటు ఇవాళ పవన్ పుట్టినరోజుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వీరి మధ్య దోస్తీ కుదిరిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్


అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యల్ని హైలెట్ చేస్తూ సాక్షి మీడియా సంస్థ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వచ్చే ఎన్నికల్లో ‘2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ’  అంటూ ట్వీట్ చేసింది. దీనిపై పవన్ అభిమానులు, టీడీపీ కారయకర్తలు మండిపడుతున్నారు. బీజేపీతో రాసుకు పూసుకు తిరిగేది మీరేనంటూ వైసీపీ నేతల్ని, సాక్షి మీడియా సంస్థను ఉతికి ఆరేస్తున్నారు. ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికలకు.. ఇప్పట్నుండి మీ పేపర్ దిగజారుడు ప్రయత్నాలు చేస్తుందని మండిపడుతున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 2, 2019, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading