Home /News /politics /

EX MINISTER AYYANNA PATRUDU BROTHER SANYASI PATRUDU JOIN IN YSRCP SB

టీడీపీకి మరో షాక్... వైసీపీలో చేరిన మాజీ మంత్రి సోదరుడు

టీడీపీ ఎన్నికల గుర్తు

టీడీపీ ఎన్నికల గుర్తు

ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడుతో పాటు భార్య అనిత, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

    ఏపీలో ఇప్పటికీ వలసలతో సతమతమవుతున్న టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా పార్టీలో చేరుతున్న సన్యాసిపాత్రుడుని సీఎం జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడుతో పాటు భార్య అనిత, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సన్యాసిపాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన సతీమణి అనిత మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తించారు.

    టీడీపీ తీరుతో మనస్తాపం చెందిన సన్యాసిపాత్రుడు దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నర్సీపట్నం పర్యటనలో ఉండగానే సన్యాసిపాత్రుడు రాజీనామా చేసి పార్టీ అధిష్టానంతో పాటు సోదరుడు అయ్యన్నకు  కూడా భారీ షాక్‌ ఇచ్చారు. పార్టీలో రెండేళ్లుగా తనకు ప్రాధాన్యత లేకుండా చేశారిని గతంలోనే సన్యాసిపాత్రుడు ఆరోపణలు చేశారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Ayyannapatrudu, Chandrababu naidu, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు