బీజేపీలో చేరిన మాజీమంత్రి... ఆ నేత డుమ్మా ?

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి... ఆ తరువాత టీడీపీలో చేరి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి అయ్యారు.

news18-telugu
Updated: October 21, 2019, 3:10 PM IST
బీజేపీలో చేరిన మాజీమంత్రి... ఆ నేత డుమ్మా ?
జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
కొంతకాలంగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఎట్టకేలకు కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి... ఆ తరువాత టీడీపీలో చేరి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలైన ఆదినారాయణరెడ్డి... అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత చాలామంది టీడీపీ నేతల బాటలోనే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆదినారాయణ... ఎట్టకేలకు కాషాయ కండువా కప్పుకున్నారు.

అయితే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిన సమయంలో... ఎంపీ సీఎం రమేశ్ లేకపోవడం సరికొత్త చర్చకు తెరలేపింది. టీడీపీలో ఉన్న సమయంలో ఆది, సీఎం రమేశ్ మధ్య విభేదాలు ఉండేవి. కడప జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు... ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నించేవారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఆదినారాయణరెడ్డి కంటే ముందే ఎంపీ సీఎం రమేశ్ బీజేపీలో చేరారు. ఆయనే ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి రాకుండా అడ్డుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఆదినారాయణ పార్టీలో చేరుతున్న సమయంలోనూ సీఎం రమేశ్ లేకపోవడం... ఈ చర్చకు మరింత ఊతమిస్తోంది.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading