బస్తాలు మోసిన మాజీమంత్రి...అంతలోనే ఎంత తేడా ?

రఘువీరారెడ్డి

2019 ఎన్నికల తరువాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవిని రాజీనామా చేసిన రఘువీరారెడ్డి... ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని తన సొంతూరు నీలకంఠాపురంలో ఉంటున్నారు.

  • Share this:
    ఆయన పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన నాయకుడు, 20 ఏళ్లకు పైగా ఎమ్మెల్యే... ఓ రాష్ట్రంలో జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఏం చేస్తున్నారో ఎవరూ ఊహించలేరు. ఎవరి ఊహకు అందని విధంగా అజ్ఞాతవాసం గడుపుతున్న మాజీమంత్రి, ఏపీ పీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి... ఇటీవల బస్తాలు మోస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2019 ఎన్నికల తరువాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవిని రాజీనామా చేసిన రఘువీరారెడ్డి... ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని తన సొంతూరు నీలకంఠాపురంలో ఉంటున్నారు.

    రాజకీయాలకు కొంత గ్యాప్ తీసుకోవాలని డిసైడయిన రఘువీరా... పాలిటిక్స్‌కు దూరం పాటిస్తున్నారు. అయితే ఇటీవల తన ఊరి చెరువుకు గండి పడటంతో స్వయంగా అనుచరులతో కలిసి రంగంలోకి దిగిన రఘువీరారెడ్డి... స్వయంగా ఇసుక బస్తాలు మోసి ఆ గండిని పూడ్చేశారు. దీంతో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా సొంతూరులో జరుగుతున్న ఆలయ నిర్మాణం పనులను రఘువీరా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేత కేవీపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి రఘువీరారెడ్డితో చర్చలు జరిపి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేకపోవడంతో... రఘువీరా పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా... ఇస్తే ఏ పార్టీలోకి వెళతారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.


    Published by:Kishore Akkaladevi
    First published: