మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ మేయర్

మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ మేయర్

ప్రతీకాత్మక చిత్రం

Bangi Anantayya: మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేత వైసీపీలో చేరారు.

 • Share this:
  Bangi Anantayya: మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేత వైసీపీలో చేరారు. వివరాలు.. టీడీపీ నేత, కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య పార్టీని వీడారు.. సోమవారం ఆయన అధికార వైసీపీ‌లో చేరారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బంగి అనంతయ్యకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, అనంతయ్య 1995వ సంవత్సరం నుంచి 2000 వరకు కర్నూలు మేయర్‌గా పనిచేశారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు లక్ష్మయ్య, సురేష్, రవిశంకర్, గణేష్, రఘు రాణా ప్రతాప్, శంకర్, చిరంజీవి సహా దాదాపు వంద మంది వైఎస్సార్‌సీపీలో చేరారు.

  వైసీపీలో చేరిన అనంతరం బంగి అనంతయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైసీపీలో చేరినట్లు చెప్పారు. కర్నూలుతో పాటు రాష్ట్రాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమన్నారు. ఇక, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించటం ఖాయమని చెప్పారు.

  కర్నూలు టీడీపీలో బంగి ఆనంతయ్య కీలక పాత్ర పోషించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయాల్లో విచిత్ర వేషధారణలతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంతో అనంతయ్య ముందుండేవారు. ఇక, గతేడాది బంగి ఆనంతయ్య ఆత్మహత్యయత్నం చేశారు. ఈ రోజు ఆయన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే సకాలంలో కుటుంబ సభ్యులు గమనించి ఆయనను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది.రాజకీయంగా అందరూ తనను మోసం చేశారని కొంతకాలంగా ఆవేదనతో ఉన్న బంగి ఆనంతయ్య... ఆ కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్టు ప్రచారం జరిగింది. అయితే గతంలో కూడా టీడీపీని వీడిన అనంతయ్య.. మళ్లీ అదే పార్టీలో చేరారు. అయితే కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు అనంతయ్య దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు